అయోధ్యలో ఆదిపురుషుడు

ABN , First Publish Date - 2022-10-03T05:55:10+05:30 IST

‘‘శ్రీరాముడిలోని అంకితభావం, రాజసం, క్రమశిక్షణ నాకు స్ఫూర్తి. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో శ్రీరాముడి లాంటి గొప్ప వీరుడి పాత్రను పోషించడం...

అయోధ్యలో ఆదిపురుషుడు

‘‘శ్రీరాముడిలోని అంకితభావం, రాజసం, క్రమశిక్షణ నాకు స్ఫూర్తి. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో శ్రీరాముడి లాంటి గొప్ప వీరుడి పాత్రను పోషించడం గర్వంగా ఉంది. ఆయన కృపవల్లే ఇది సాధ్యమైంది. భయ భక్తులతో చేసిన సినిమా ఇది. భగవాన్‌ శ్రీరాముడి ఆశీస్సులతో అయోధ్య నుంచి ‘ఆదిపురుష్‌’ ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం’ అని ప్రభాస్‌ అన్నారు. ఆయన శ్రీరాముడి పాత్రధారిగా దర్శకుడు ఓం రౌత్‌ రూపొందించిన చిత్రమిది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆదివారం అయోధ్యలో చిత్రబృందం పూజా కార్యక్రమాలను నిర్వహించి టీజర్‌ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కృతిసనన్‌ మాట్లాడుతూ ‘‘ఆదిపురుష్‌’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. జీవితంలో ఒక్కసారే లభించే అవకాశం ఇది. నాకు చాలా త్వరగా వచ్చింది. జానకి పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అన్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుందని ఓం రౌత్‌ అన్నారు. మా నాన్నగారి కల ఈ సినిమాతో నెరవేరింది. ప్రభాస్‌తో మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తూనే ఉంటాను అని నిర్మాత భూషణ్‌కుమార్‌ చెప్పారు. 


Updated Date - 2022-10-03T05:55:10+05:30 IST

Read more