Prabhas: అయోధ్యలో ‘ఆదిపురుష్‌’ హల్‌చల్‌!

ABN , First Publish Date - 2022-10-03T00:07:30+05:30 IST

అయోధ్యలో ‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రభాస్‌, చిత్రం బృందం అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ రామాయణ హోటల్‌లో బస చేస్తున్నారు.

Prabhas: అయోధ్యలో ‘ఆదిపురుష్‌’ హల్‌చల్‌!

అయోధ్యలో ‘ఆదిపురుష్‌’ (Adipurush Teaser) టీజర్‌ విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రభాస్‌,(Prabhas) చిత్రం బృందం అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ రామాయణ హోటల్‌లో బస చేస్తున్నారు. ఇటీవల చిత్రంలోని రాముడి లుక్‌లో ప్రభాస్‌ పోస్టర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే! దసరా కానుకగా ఆదివారం ఈ చిత్రం టీజర్‌ అయోధ్యలో విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేసింది. ప్రభాస్‌ అయోధ్య చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఉత్కంతగా ఎదురుచూస్తున్నారు. 

ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సీతగా కృతీసనన్‌(Krithisanon), లంకేశుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ఓంరౌత్‌ దర్శకత్వంలో భూషణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Updated Date - 2022-10-03T00:07:30+05:30 IST

Read more