Prabhas: అందుకే మనం మనుషులం.. ఆయన రాముడు!

ABN , First Publish Date - 2022-10-03T06:36:09+05:30 IST

‘వస్తున్నా... న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి! ఆగమనం... అధర్మ విధ్వంసం’ అన్న డైలాగ్‌ ఆకట్టుకుంటుంది.

Prabhas: అందుకే మనం మనుషులం.. ఆయన రాముడు!

ఆగమనం... అధర్మ విధ్వంసం’ 

‘రాముడి (Sriramudu)పాత్ర చేయాలని దర్శకుడు చెప్పినప్పుడు భయపడ్డాను. మొదట అంగీకరించలేదు. మూడు రోజులు తర్వాత దర్శకుడికి ఫోన్‌ చేసి ఎలా చేయాలి.. రాముడిగా మెప్పించాలంటే ఏం చేయాలి అన్న విషయాలను చర్చించుకున్నాం. ఆ తర్వాతే రాముడి పాత్ర చేయడానికి అంగీకరించా’’ అని ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) అన్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. (Adipurush) టీ సిరీస్‌ అధినేత భూషణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న (january 12)సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రం టీజర్‌ను అయోధ్యలో విడుదల చేశారు. టీజర్‌ రిలీజ్‌కు ముందు ప్రభాస్‌ సహా చిత్ర బృందం అయోధ్య రామచంద్రుడిని దర్శించుకున్నారు. 




ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడు. రాముడుపై ఉన్న భక్తి, భయం ‘ఆదిపురుష్‌’ యాక్ట్‌ చేసేలా చేశాయి. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం ఈ మూడు విషయాలను శ్రీరాముడి ప్రవర్తన నుంచి నేర్చుకోవచ్చు.  శతాబ్ధాలుగా మనం ఈ అంశాలను అనుసరించాలనుకుంటున్నాం. కానీ మన వల్ల కావడం లేదు. అందుకే మనం మనుషులం అయ్యాం. ఆయన రాముడు.. దేవుడు అయ్యాడు. శ్రీరాముడి కృప మా సినిమా ఉంటుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమాలో సీతగా కృతీసనన్‌, రావణుడిగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ నటిస్తున్నారు. 


‘వస్తున్నా... న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి! 

ఆగమనం... అధర్మ విధ్వంసం’ అన్న డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. 


Updated Date - 2022-10-03T06:36:09+05:30 IST