సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Yashoda షూటింగ్ పూర్తి చేసిన విలక్షణ నటి..

ABN, First Publish Date - 2022-06-27T00:41:01+05:30

సమంత (Samantha) ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాలలో 'యశోద' (Yashoda) ఒకటి. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) కీలక పాత్రలో నటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత (Samantha) ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాలలో 'యశోద' (Yashoda) ఒకటి. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆమె మధుబాల పాత్రలో కనిపించబోతుంది. సమంత నటించిన గత చిత్రం 'కన్మణి రాంబో ఖతీజా' ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో త్వరలో యశోద సినిమాతో రాబోతున్నారు సమంత. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ వచ్చి ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ చూస్తేనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా యశోద రూపొందుతుందని అనిపిస్తోంది. 


సమంత ఇప్పటి వరకు చేయని ఓ సరికొత్త పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. హరి (Hari) అండ్ హరీష్ (Harish) ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, సంపత్ రాజ్, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ (Mani Sharma) సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసినట్టుగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ పెట్టారు. 


ఇందులో వరలక్ష్మీ "యశోద టీమ్‌కి చాలా కృతజ్ఞతలు. ఇది నాకు ఒక ర్యాప్. మీ అందరితో కలిసి షూటింగ్ జరుపుకున్నాను. మీరు సినిమా చూసేందుకు వేచి ఉండలేను. నేను నా దర్శకులతో.. ముఖ్యంగా నా డార్లింగ్ డాప్ సుగు సర్‌తో మంచి సమయాన్ని గడిపాను. చాలా సరదాగా గడిపాను"..అని రాసుకొచ్చారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 12 భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయబోతున్న మేకర్స్ ఇప్పటికే డేట్‌ను కూడా ప్రకటించారు. క్రాక్, నాంది సినిమాల ద్వారా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న వరలక్ష్మీ యశోద మూవీతో ఎలాంటి పేరు తీసుకువస్తుందో చూడాలి.

Updated Date - 2022-06-27T00:41:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!