సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తల్లి కాబోతోన్న మరో హీరోయిన్

ABN, First Publish Date - 2022-01-10T02:59:16+05:30

మరో హీరోయిన్ తల్లి కాబోతోంది. ఇటీవల కాజల్ అగర్వాల్ గర్భవతి అనే విషయం స్వయంగా ఆమె భర్త వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో పలు చిత్రాల్లో నటించిన నటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో హీరోయిన్ తల్లి కాబోతోంది. ఇటీవల కాజల్ అగర్వాల్ గర్భవతి అనే విషయం స్వయంగా ఆమె భర్త వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో పలు చిత్రాల్లో నటించిన నటి సంజనా గల్రానీ తల్లి కాబోతోంది. కన్నడ చిత్రసీమలో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయి, మూడు నెలల జైలు జీవితం తర్వాత బెయిల్‌పై ఆమె విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె అజీజ్‌ బాషా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. తర్వాత సంజనా గల్రానీ కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. ఇపుడు ఆమె ఐదు నెలల గర్భిణి. 


దీనిపై సంజనా స్పందిస్తూ.. ‘‘ఇపుడు నేను ఐదు నెలల గర్భవతిని. ప్రసవం అయ్యేంత వరకు శ్రమించాలని నిర్ణయించాను. అనేక మంది మహిళలు తమ ప్రసవం తేదీకి రెండు వారాల ముందు వరకు పనులు చేయడం చూశాను. ఇపుడు నేను కూడా ఇదే విధంగా పని చేయాలని నిర్ణయించుకున్నాను’ అని వివరించింది.

Updated Date - 2022-01-10T02:59:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!