Abhinaya: విశాల్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన అభినయ

ABN , First Publish Date - 2022-10-31T14:03:32+05:30 IST

సౌతిండియా సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో కోలీవుడ్ (Kollywood) నటుడు విశాల్ (Vishal) ఒకరు..

Abhinaya: విశాల్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన అభినయ

సౌతిండియా సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో కోలీవుడ్ (Kollywood) నటుడు విశాల్ (Vishal) ఒకరు. ఆయన సినిమాలకి తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. నటుడిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్న విశాల్ పెళ్లిపై గత కొంతకాలంగా పలు వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. విశాల్ ఇప్పటికే పలువురిలో పీకల్లోతు ప్రేమలో పడ్డట్లు వార్తలు వినిపించాయి.


ఇంతకుముందు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో విశాల్ ప్రేమాయణం సాగించాడని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత అదేమీ లేదని వారు చెప్పడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. అనంతరం హైదరాబాద్‌కు చెందిన యువతితో విశాల్‌కు నిశ్చితార్థం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ అక్కడితో దానికి ఎండ్ కార్డ్ పడింది. ఆ విషయం గురించి ఎటువంటి వార్త బయటికి రాలేదు. దాంతో అందరూ ఆ పెళ్లి గురించి మర్చిపోయారు. తాజాగా నటి అభినయతో విశాల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు, త్వరలో వీరిద్దరూ పెళ్లీ పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా అభినయ (Abhinaya) స్పందించింది.


హీరో విశాల్‌ను ప్రేమిస్తున్నానని, త్వరలోనే మా ఇద్దరి పెళ్లి జరుగనున్నట్టు వస్తున్న వార్తలను అభినయ కొట్టి పారేసింది. షూటింగ్‌ లొకేషన్‌లో తీసుకున్న ఫొటోలను కొందరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ప్రేమ, పెళ్లి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేసింది.. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. ‘‘విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మార్క్‌ ఆంటోనీ’లో ఓ పాత్రలో నటిస్తున్నాను. షూటింగ్‌ కోసం తీసిన ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ అయ్యాయి. వీటిని చూసిన కొందరు తామిద్దరం ప్రేమలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని స్పష్టం చేసింది.

Updated Date - 2022-10-31T14:03:32+05:30 IST