సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇది దేవుడిచ్చిన గిఫ్ట్‌

ABN, First Publish Date - 2022-09-17T08:05:07+05:30

‘పదేళ్ల నా నటజీవితంలో ఇంతవరకూ పది చిత్రాల్లో హీరోగా, మరి కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించాను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పదేళ్ల నా నటజీవితంలో ఇంతవరకూ పది చిత్రాల్లో హీరోగా, మరి కొన్ని సినిమాల్లో  కీలక పాత్రలు పోషించాను. ప్రస్తుతం నటిస్తున్న మెగా ఫిల్మ్స్‌ చిత్రం నాకు మరింత పేరు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో నా సరసన ఈషా చావ్లా నటిస్తున్నారు. కాలకేయ ప్రభాకర్‌ విలన్‌గా నటిస్తున్నారు. చిత్రకథ మా  ముగ్గురి చుట్టూ తిరుగుతుంది’ అని చెప్పారు వర్ధమాన హీరో రాజ్‌ బాల. జాక్‌ దర్శకత్వంలో కమలాకర్‌, కిశోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 40 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుందనీ, తదుపరి షెడ్యూల్‌ త్వరలో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇన్ని సినిమాల్లో హీరోగా నటించే అవకాశం రావడం దేవుడు ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తున్నానని రాజ్‌బాల చెప్పారు. సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన ‘గాలోడు’ విడుదలకు సిద్ధంగా ఉందనీ, ఇందులో నెగెటివ్‌ రోల్‌ చేశానని ఆయన చెప్పారు. ‘నాకూ పెళ్లాం కావాలి’, ‘రా’ చిత్రాల్లో నటిస్తున్నట్లు రాజ్‌బాల తెలిపారు.

Updated Date - 2022-09-17T08:05:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!