సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Range Rover: టైటిల్ మరియు ఫస్ట్ లుక్ వదిలిన అలీ

ABN, First Publish Date - 2022-05-19T00:46:06+05:30

ఆట సందీప్ (Aata Sandeep) హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘రేంజ్ రోవర్’ (Range Rover). ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్స్ బ్యానర్‪లో.. ఓఎస్ఆర్ కుమార్ (OSR Kumar) స్వీయదర్శకత్వంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆట సందీప్ (Aata Sandeep) హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘రేంజ్ రోవర్’ (Range Rover). ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్స్ బ్యానర్‪లో.. ఓఎస్ఆర్ కుమార్ (OSR Kumar) స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర..  టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‪ను తాజాగా నటుడు అలీ (Ali) విడుదల చేశారు. ఆట సందీప్ సరసన మేఘన రాజ్‪పుత్ (Meghana Rajput) హీరోయిన్‪గా నటిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్దన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతి రాజ్ (Jyothi Raj) ఐటమ్ సాంగ్‪లో కనిపించనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రొమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. త్వరలోనే చిత్ర ట్రైలర్, లిరికల్ సాంగ్స్‪ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.


ఫస్ట్ లుక్ విడుదల అనంతరం అలీ మాట్లాడుతూ.. ‘‘ఓఎస్ఆర్ కుమార్ దర్శకత్వంలో ఆట సందీప్ చేస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రేంజ్ రోవర్ టైటిల్ చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు విజయం అందిస్తారని ఆశిస్తున్నాను. చిత్రయూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి సత్య సోమేష్ సంగీతం సమకూర్చుతున్నారు.

Updated Date - 2022-05-19T00:46:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!