జర్నలిస్టుగా నటించా
ABN , First Publish Date - 2022-12-08T10:27:14+05:30 IST
‘చెప్పాలని ఉంది’ చిత్రంతో యష్ పూరి హీరోగా పరిచయం అవుతున్నారు. అరుణ్ భారతి దర్శకత్వంలో...

‘చెప్పాలని ఉంది’ చిత్రంతో యష్ పూరి హీరోగా పరిచయం అవుతున్నారు. అరుణ్ భారతి దర్శకత్వంలో వాకాడ అంజన్‌కుమార్, యోగేష్ కుమార్ నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్బంగా యష్ పూరి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఇందులో నేను జర్నలిస్టుగా నటించా. నాకు ఏదో చెప్పాలని ఉంటుంది. కానీ చెప్పలేక పోతాను. అందుకే ఈ సినిమాకు ‘చెప్పాలని ఉంది’ టైటిల్ చాలా యాప్ట్. సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థతో పరిచయం నా అధృష్టం’ అని తెలిపారు.