Acharya: ట్విట్టర్ రివ్యూ..ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్
ABN, First Publish Date - 2022-04-29T13:55:22+05:30
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మెగా మల్టీస్టారర్ ఆచార్య ఈరోజు (ఏప్రిల్ 29) భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను పూర్తి స్థాయిలో సిల్వర్ స్క్రీన్ మీద చూడాలనేది మెగా ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు, అందరికీ ఉన్న కల. అది ఆచార్య సినిమాతో నెరవేరింది.
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మెగా మల్టీస్టారర్ ఆచార్య ఈరోజు (ఏప్రిల్ 29) భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్థరాత్రి నుంచే ప్రీమియర్, స్పెషల్ షోలు పడ్డాయి. ఈ భారీ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ అందరిలో ఊహకందని విధంగా అంచనాలు పెంచేశాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఆచార్య ఉందా లేదా..సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్‌లో అభిమానులు, నెటిజన్లు చిత్రం గురించి ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారో ఓ సారి చుద్దాం.
ట్విట్టర్‌లో ఫ్యాన్స్, నెటిజన్లు పెడుతున్న ట్వీట్స్‌ను బట్టి చూస్తే ఆచార్య సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని అర్థమవుతోంది. ఫస్టాఫ్ ఓకేగా ఉందని.. సెకండాఫ్‌లో తండ్రీకొడుకులు చిరు - చరణ్ కలిసి కనిపించే సన్నివేశాలు అభిమానులకు పూనకాలు తెప్పించాయని చెబుతున్నారు. ఇందులో చరణ్ పాత్రే సినిమాకు ఎంతో హైలెట్ అని కామెంట్స్ వస్తున్నాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశంలో సిద్ధ పాత్రలో చరణ్ అద్భుతంగా నటించాడని, ఆ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయని అంటున్నారు. ఇక సినిమాకు మరో హైలెట్ అంటే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. చిరు సినిమా అంటే మణి ప్రాణం పెట్టేస్తారు. ఇప్పుడు ఆచార్యకు కూడా ఏమాత్రం తగ్గలేదని టాక్ వినిపిస్తోంది. ఫైనల్‌గా ఆచార్య మెగా ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ అని, బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అని చెబుతున్నారు.
ఇక చిరుకి హీరోయిన్ లేకపోయినా రెజీనాతో స్పెషల్ సాంగ్, లాహే లాహే సాంగ్‌లో సంగీత.. చిరు సరసన కనిపించి ఆ లోటును భర్తీ చేశారని..భలే భలే బంజారా సాంగ్‌లో చిరు - చరణ్‌లను స్క్రీన్ మీద చూస్తుంటే రెండు కళ్ళూ చాలవని..ఈ సాంగ్ రాగానే అరుపులు, కేకలు డాన్సులతో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయని ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి మెగా మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య కొత్త రికార్డులను క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు.
అయితే, కొరటాల గత చిత్రాలతో పోలిస్తే మాత్రం ఆచార్య ఆ స్థాయిలో లేదనే కామెంట్స్ వస్తున్నాయి. కథ, కథనంలో లోపం ఉండటం వల్ల కొన్ని సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తున్నాయని చెబుతున్నారు. చరణ్ సరసన హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డే పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఓవరాల్‌గా ఆచార్య అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని చెబుతున్నారు.