సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆచార్య ట్రైలర్‌: ధర్మస్థలి.. అధర్మస్థలి ఎలా అవుద్ది!

ABN, First Publish Date - 2022-04-13T00:46:59+05:30

‘‘పాదఘట్టం వాళ్ల గుండెల మీద కాలేస్తే.. ఆ కాలు తీసేయాలట.. కాకపోతే అది ఏ కాలా అని’, అంటూ ఆచార్య ట్రైలర్‌తో ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ‘నేను వచ్చానని చెప్పాలనుకున్నా... కానీ చేయడం మొదలుపెడితే’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌లకు థియేటర్‌లో మోత మోగాల్సిందే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘పాదఘట్టం వాళ్ల గుండెల మీద కాలేస్తే.. ఆ కాలు తీసేయాలట.. కాకపోతే అది ఏ కాలా అని’, అంటూ ఆచార్య ట్రైలర్‌తో ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ‘నేను వచ్చానని చెప్పాలనుకున్నా... కానీ చేయడం మొదలుపెడితే’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌లకు థియేటర్‌లో మోత మోగాల్సిందే! మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ‘ఆచార్య’ థియేట్రికల్‌ ట్రైలర్‌ అంత పవర్‌ఫుల్‌గా ఉంది. అందులో చిరంజీవి, రామ్‌చరణ్‌, సోనూసూద్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. 


‘దివ్యవనం ఒకవైపు.. తీర్థ జలం ఒకవైపు.. నడుమ పాదఘట్టం.. 

ఇక్కడ అందరూ సౌమ్యులు... పూజలు పునస్కారాలు చేసుకుంటూ కష్టాలు వచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారమేసి బిక్కుబిక్కుమంటూ ఉంటామేమో అనుకుని పొరపడి ఉండొచ్చు. ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకు పంపుతుంది. ధర్మస్థలి.. అధర్మస్థలి ఎలా అవుతాది’’ అన్న డైలాగ్‌లతో రామ్‌చరణ్‌ ఎంట్రీ ఇచ్చారు. 


ట్రైలర్‌లో కాస్త లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా, పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో ఎంటర్‌ అయ్యారు చిరంజీవి. ‘పాదఘట్టం వాళ్ల గుండెల మీద కాలేస్తే.. ఆ కాలు తీసేయాలట.. కాకపోతే అది ఏ కాలా అని.’ అన్న డైలాగ్‌లకు నెట్టింట విపరీతంగా స్పందన వస్తోంది. 


‘ఊళ్లోకి వచ్చి ఇద్దరు ముక్కూ మొహం తెలియని నాకొడుకుల్ని కొట్టేసి ఏదో చేసేశానునుకుంటున్నావా’ అని సోనూసూద్‌ అన్న డైలాగ్‌కి.. ‘‘నేను వచ్చానని చెప్పాలనుకున్నా... కానీ చేయడం మొదలుపెడితే’’ అంటూ చిరంజీవి ఇచ్చిన సమాధానం ఆసక్తి రేకెత్తిస్తోంది. సిద్ధా తెలుసా మీకు... అని తనికెళ్ల భరణి అనగానే చరణ్‌ ఎంట్రీ ఇంటెన్స్‌గా ఉంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ‘ఆచార్య’ హవా నడుస్తోంది. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రంలో చిరంజీవికి జతగా కాజల్‌, చరణ్‌ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. 24న యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 








Updated Date - 2022-04-13T00:46:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!