Acharya : ట్రైలర్ రెడీ అవుతోంది.. అభిమానులకు పండగే

ABN , First Publish Date - 2022-04-03T16:35:32+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, అజేయ దర్శకుడు కొరటాల శివ తొలి కలయికలో తెరకెక్కిన మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో.. ఆసక్తికరమైన కథాకథనాలతో చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో టెంపుల్ సిటీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. సినిమాలోని మేజర్ పార్ట్ అందులోనే చిత్రీకరణ జరుపుకుంది. ఇదివరకు విడుదలైన ‘ఆచార్య’ టీజర్, మూడు సింగిల్స్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది.

Acharya : ట్రైలర్ రెడీ అవుతోంది.. అభిమానులకు పండగే

మెగాస్టార్ చిరంజీవి, అజేయ దర్శకుడు కొరటాల శివ తొలి కలయికలో తెరకెక్కిన మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో.. ఆసక్తికరమైన కథాకథనాలతో చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో టెంపుల్ సిటీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. సినిమాలోని మేజర్ పార్ట్ అందులోనే చిత్రీకరణ జరుపుకుంది. ఇదివరకు విడుదలైన ‘ఆచార్య’ టీజర్, మూడు సింగిల్స్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. నిన్న (శనివారం) ఉగాది సందర్భంగా ‘ఆచార్య’ మేకర్స్ ప్రేక్షకులకు విషెస్ తెలుపుతూ.. ట్రైలర్ లోడ్ అవుతోందని,  మాస్ట్ ఫీస్ట్ కు రెడీగా ఉండమంటూ అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఒక వీడియో రూపంలో తెలిపారు. 


ఇక ఇందులో సిద్ధ అనే ప్రత్యేక పాత్రలో రామ్‌చరణ్ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. ఇంతకు ముందు విడుదల చేసిన రామ్ చరణ్, పూజా హెగ్డేల పాట, చరణ్ పై ప్రత్యేకంగా కట్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులోని చెర్రీ పాత్రపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నేపథ్యంలో ‘ఆచార్య’ చిత్రంపై మరింత హైపు క్రియేట్ అయింది. కరోనా కారణంగా ఇప్పటికే పలు మార్లు విడుదల తేదీని మార్చుకుని అభిమానుల్ని ఊరించిన  ‘ఆచార్య’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.  



Updated Date - 2022-04-03T16:35:32+05:30 IST