పోలీ్‌సగా రవితేజ?

ABN , First Publish Date - 2022-08-02T06:35:35+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. బాబి దర్శకుడు. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు...

పోలీ్‌సగా రవితేజ?

చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. బాబి దర్శకుడు. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఇందులో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రవితేజ సెట్లోకి అడుగుపెట్టారు. చిరంజీవి, రవితేజలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. చిరు, రవితేజ సవతి సోదరులుగా నటించబోతున్నట్టు సమాచారం. అంతే కాదు.. చిరు ఓ స్మగ్లర్‌గా, రవితేజ ఓ పోలీ్‌సగా కనిపించనున్నారని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ పోలీస్‌ అవతారం ఎత్తిన చిత్రాలన్నీ హిట్టే. ‘విక్రమార్కుడు’, ‘క్రాక్‌’ చిత్రాలు మంచి విజయాల్ని అందుకొన్నాయి. ఆ సెంటిమెంట్‌ ‘వాల్తేరు వీరయ్య’కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 


Updated Date - 2022-08-02T06:35:35+05:30 IST