బాలీవుడ్ క్రేజీ దర్శక ద్వయంతో మెగా పవర్‌స్టార్?

ABN , First Publish Date - 2022-04-08T16:31:33+05:30 IST

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విజయోత్సాహంతో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ రాబడుతూ.. ఇంకా జోరుమీదుంది. రీసెంట్‌గా ఈ సినిమా సక్సెస్ పార్టీ ముంబైలో చాలా గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ అతిరథ మహారథుల సమక్షంలో ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ సక్సెస్ వేడుకల్ని జరిపింది. దర్శకుడు రాజమౌళి, హీరోలు తారక్, చెర్రీలు ఈ వేడుకకు హైలైట్స్ గా నిలిచారు. ఈ వేడుకకు ప్రముఖ బాలీవుడ్ దర్శక ద్వయం అబ్బాస్ - మస్తాన్ సైతం హాజరయ్యారు. ఈ వేడుకలో.. ‘ఆర్.ఆర్.ఆర్’ లోని చెర్రీ నటనను ఆకాశానికెత్తేశారు. ఈ సందర్భంగా వారిద్దరూ రామ్ చరణ్ తో ఫోటో కూడా దిగారు. ఆ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ మెగాభిమానులు ఖుషీ అయ్యే పోస్ట్ ఒకటి పెట్టారు.

‘డియర్ రామ్ చరణ్ నిన్న సాయంత్రం పార్టీలో నిన్ను మీటవడం చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్ లో మనం కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నాం. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సూపర్ సక్సెస్ అయినందుకు మీకు అభినందనలు’.. అంటూ ఒక వ్యాఖ్యను జత చేశారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో  ఎన్నో సూపర్ హిట్ కమర్షియల్ చిత్రాల్ని తీసిన దర్శకులు అబ్బాస్ అండ్ మస్తాన్. ముఖ్యంగా వీరు తీసిన సస్పెన్స్ యాక్షన్ చిత్రాలైన ‘ఖిలాడీ, బాజీగర్, హంరాజ్, 36 చైనాటౌన్, సోల్జర్, అజ్నబీ, బాద్షా, ఐత్రాజ్, రేస్, రేస్ 2’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరి అలాంటి దర్శకులు రామ్ చరణ్ తో ఏ తరహా చిత్రం తీస్తారో చూడాలి. Updated Date - 2022-04-08T16:31:33+05:30 IST

Read more