Aam Aha: ఈ సినిమా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందట!
ABN , First Publish Date - 2022-08-18T01:23:17+05:30 IST
సుధాకర్ జంగం (Sudhakar Jangam), లావణ్య (Lavanya), సిరి (Siri) హీరోహీరోయిన్లుగా.. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై శ్యామ్ మండల (Syam Mandala) దర్శకత్వంలో
సుధాకర్ జంగం (Sudhakar Jangam), లావణ్య (Lavanya), సిరి (Siri) హీరోహీరోయిన్లుగా.. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై శ్యామ్ మండల (Syam Mandala) దర్శకత్వంలో జోరిగె శ్రీనివాసరావు (Jorige Srinivasa Rao) నిర్మించిన చిత్రం ‘అం అః’ (Aam Aha). ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ.. మళ్లీ మళ్లీ సినిమాను చూడాలనేంత గ్రిప్పింగ్‌గా, ఒళ్లంతా రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని చిత్రీకరించడానికి చాలా టైమ్ పట్టింది. రెండు మూడు కథలు అనుకున్నాం. కొత్తవాళ్లతో ఈ సినిమా తీయాలని అనుకున్నాం. సుధాకర్ ఈ కథకు కరెక్ట్‌గా సరిపోయారు. పాండమిక్‌ను ఎదుర్కొని.. ఈ సినిమాని నిర్మించాం. ఆగస్ట్ 19న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని కోరుతున్నాను..’’ అన్నారు.
హీరో సుధాకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఈ స్థాయికి రావడానికి ఎంతో మంది కృషి, త్యాగం ఉంది. మా ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ ఇచ్చింది. టీమంతా నన్ను నమ్మింది. అలాగే నన్ను నమ్మి నిర్మాత ఎంతో ఖర్చు పెట్టారు. నాతో వర్క్ షాప్‌లు చేయించి ఇంత బాగా సినిమాను తీసిన దర్శకుడికి ధన్యవాదాలు. ఈ సినిమాకు అందరూ ఒక సైన్యంలా పనిచేశారు. కొత్తవాడిని అని చూడకుండా.. హీరోయిన్లు లావణ్య, సిరి ఎంతగానో సహకరించారు. సినిమాకి పనిచేసిన టీమ్ అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలపగా.. డైరెక్టర్ శ్యామ్ మండల మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు ఫస్ట్ థియేటర్ మూవీ. నాకు ఈ అవకాశం అంత ఈజీగా రాలేదు. నిర్మాతకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా కల సాకారం అవ్వడానికి మా నిర్మాత కారణం. సురేందర్ రెడ్డి, గుణ శేఖర్, వైవీఎస్ చౌదరిల వద్ద పదమూడేళ్లు పని చేశాను. నవీన్ ఇరగాని నాకు ఈ సబ్జెక్ట్ అందించి సాయం చేశారు. కరోనా సమయంలో ఈ సినిమాను ప్రారంభించాం. కరోనా మధ్యలో ఓ చిన్న చిత్రం చేశాం. ఓ డైరెక్టర్‌ను సంతృప్తి పర్చడం అంత సులభం కాదు. కానీ సుధాకర్ గారు ఎంతో బాగా నటించారు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింట్లోనూ ఎంతో శ్రద్ద చూపించారు. అది చూసి నాకే షాకింగ్‌గా అనిపించింది. కొత్త హీరోతో కాదు సీనియర్ హీరోతో పని చేసినట్టు అనిపించింది. లావణ్య, సిరి.. మంచి పాత్రలు పోషించారు. సహకరించిన అందరికీ థ్యాంక్స్’’ అని అన్నారు. ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినిమా ఘన విజయం సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. (Aam Aha Pre Release Event)