‘ఆకాశ వీధుల్లో’ విహరిద్దాం
ABN, First Publish Date - 2022-07-30T08:29:02+05:30
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’.
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్ కృష్ణ దర్శకుడు. మనోజ్ డి, మణికంఠ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆహ్లాదకరమైన ప్రేమకథ ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. జుడా శాండీ స్వరాలు ఆకట్టుకొంటాయ’’న్నారు. దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు నటించారు. కెమెరా: విశ్వనాథ్ రెడ్డి.