మరో వైవిద్యభరితమైన చిత్రంలో ఆది సాయికుమార్

ABN , First Publish Date - 2022-04-08T01:03:11+05:30 IST

నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ యువ హీరో.. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ

మరో వైవిద్యభరితమైన చిత్రంలో ఆది సాయికుమార్

నటుడు సాయికుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘ప్రేమ కావాలి’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ యువ హీరో.. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. సరైన హిట్ ఈ మధ్య కాలంలో ఆది సాయికుమార్‌కి రానప్పటికీ.. టాలీవుడ్ నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు.  


ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఆది సాయి కుమార్ కొత్త చిత్రం ప్రారంభమైంది. తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని ఓ వైవిద్యభరితమైన కథతో ఈ సినిమాను రూపొందించనున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. 

Updated Date - 2022-04-08T01:03:11+05:30 IST

Read more