Crazy Fellow Film Review: అదర గొట్టిన ఆది సాయికుమార్

ABN , First Publish Date - 2022-10-14T20:22:14+05:30 IST

ప్రస్తుతం వున్న యువ నటుల్లో ఆది సాయికుమార్ (Aadi Saikumar) కి మంచి నటుడిగా పేరు వుంది కానీ, ఈ మధ్య మంచి విజయం మాత్రం రావటం లేదు.

Crazy Fellow Film Review: అదర గొట్టిన ఆది సాయికుమార్

సినిమా: క్రేజీ ఫెలో 

నటీనటులు : ఆది సాయి కుమార్, దిగంగనా సూర్యవన్షి, మిర్నా మీనన్, నర్రా శ్రీనివాస్, సప్తగిరి, అనీష్ కురువిల్లా, వినోదిని వైద్యనాథ్ తదితరులు

సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల

సంగీతం: ఆర్ఆర్ ధృవన్

నిర్మాత: కె.కె. రాధామోహన్ 

రచన, దర్శకత్వం : ఫణికృష్ణ సిరికి


సురేష్ కవిరాయని 


ప్రస్తుతం వున్న యువ నటుల్లో ఆది సాయికుమార్ (Aadi Saikumar) కి మంచి నటుడిగా పేరు వుంది కానీ, ఈ మధ్య మంచి విజయం మాత్రం రావటం లేదు. అయినా పట్టుదలతో మంచి సినిమా చెయ్యాలన్న కసితో కొత్త దర్శకులతో పని చేస్తూ వస్తున్నా ఆది, ఈసారి 'క్రేజీ ఫెలో ' (Crazy Fellow film) తో ఈవారం మన ముందుకు వచ్చాడు. యంగ్ దర్శకుడు ఫణి కృష్ణ (Director Phani Krishna) కి దర్శకుడిగా మొదటి అవకాశం ఈ సినిమాతో ఇచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందొ ఏంటో చూద్దాం. 


కథ  (Crazy Fellow story)

అభిరామ్ (ఆది సాయి కుమార్) తల్లిదండ్రులు చిన్నతనంలో మరణించడంతో అన్న, వదిన ల దగ్గర పెరుగుతాడు. స్నేహితులతో గడుపుతూ, పబ్స్, పార్టీలు అంటూ తిరుగుతున్న తమ్ముడిని మంచి దారిలో పెట్టాలన్న యోచనతో అన్న (అనీష్ కురువిల్లా,) తన స్నేహితుడి (సప్తగిరి) కంపెనీలో వుద్యోగం చెయ్యమంటాడు. ఆ కంపెనీలో మధుమిత (దిగంగనా సూర్యవన్షి) అనే అమ్మాయిని చూస్తాడు, కానీ ఆమెతో ఎప్పుడూ పోట్లాట పెట్టుకుంటాడు. మధుమిత అంతకు ముందే అభిరాం చేసే అల్లరి పనులు చూసి ఉండటం వల్ల , ఆమెకి అభిరామ్ అంటే సదభిప్రాయం లేదు. కానీ ఈ ఇద్దరూ స్నేహితుల ప్రోద్భలంతో డేటింగ్ అప్లికేషన్స్ ఓపెన్ చేసి, అభిరాం ఏమో నాని అని, మధుమిత ఏమో చిన్ని అని మారు పేర్లు, వేరే ఫొటోస్ పెట్టుకొని ఒకరికి ఒకరు తెలియకుండా చాటింగ్ చేస్తూ వుంటారు. వాళ్లిద్దరూ ఒకే ఆఫీస్ లో పక్క పక్క కేబిన్ లోనే వుంటూ ఇద్దరికీ తెలియకుండా చాటింగ్ చేసుకుంటూ వుంటారు.  ఒకసారి ఇద్దరికీ ఒకరిని ఒకరు చూడాలనిపించి ఒక కాఫీ షాప్ లో కలుద్దాం అనుకుంటారు. టైం చెప్పి రెడ్ డ్రెస్ వేసుకొని రమ్మంటాడు. కాఫీ షాప్ లో ఎదురు చూస్తున్న అభిరాం కి రెడ్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి రావటం కనిపించగానే ఎత్తుకొని తాను ఆమెని లవ్ చేస్తున్నట్టు చెప్తాడు. అక్కడే వున్న ఆమె తల్లిదండ్రులు, అన్న విచిత్రంగా ఇదంతా చూస్తూ అభిరాం ని కొడతారు.  ఇంతకీ ఆ చిన్ని, ఇప్పుడు అభిరాం కి కనపడిన చిన్ని ఒకరేనా? ఇద్దరు చిన్ని లు లో ఎవరిని ఆది చేసుకుంటాడు, ఎలా తన ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకున్నాడు అన్నదే మిగతా కథ. 


విశ్లేషణ:

ఆది సాయి కుమార్ ఎక్కువగా కొత్త దర్శకులను పరిశ్రమకి పరిచయం చేస్తున్నాడు, అది ఒక మంచి పరిణామం. ఇంతకు ముందు తన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించిందా లేదా అనే విషయం పక్కన పెట్టి, ఆది వరసగా సినిమాలు చేస్తూ, కొత్త దర్శకులతో ముందుకు వెళుతున్నాడు. బహుశా ముందు సినిమాలు ఎందుకు విజయం సాధించలేదు అనే విషయం బాగా పరిశీలించి, ఈసారి కొంచెం లుక్ మర్చి ఎంటర్ టైన్ మెంట్ చేద్దాం అనుకున్నాడు. అందుకు దర్శకుడు ఫణికృష్ణ చెప్పిన ఈ 'క్రేజీ ఫెలో కథ ఎంచుకున్నాడు. ఈ కథ కొత్తది కాకపోయినా, తెలిసిన కథే తీసుకున్నా , చెప్పే విధానం సరదాగా చెప్పడం లో కొంత సఫలీకృతం అయ్యాడు దర్శకుడు అని చెప్పవచ్చు. ఆది ని కొత్తగా చూపించాలనుకున్నాడు, చూపించాడు కూడా. అందుకే ఇందులో మనం ఒక కొత్త ఆదిని చూడొచ్చు. ఒక సాఫ్ట్ వెర్ కంపెనీ అందులో పనిచేసేవాళ్ళ వాళ్ళ మధ్య జరిగే సంభాషణ చిన్న డైలాగ్స్ తో కామెడీ బాగా పండించాడు దర్శకుడు. డేటింగ్ అప్లికేషన్ లో ఫేక్ ఫొటోస్, పేర్లు పెట్టి చాట్ చెయ్యడం, చివరికి ఒకరిని అనుకొ ని ఇంకొకరితో వెళ్లడం లాంటివి, చివరికి నిజమయిన ప్రేమే గెలుస్తుంది అని చెప్పడంలో దర్శకుడు బాగానే హాస్యం తో కూడిన సన్నివేశాలను పండించాడు. అలాగే మధ్యలో చిన్న భావేద్వేగా సన్నివేశాలను కూడా పెట్టాడు. ముఖ్యంగా మొదటి సగం లో నర్రా, ఆది మధ్య జరిగే సంభాషణబాగా నవ్వు తెప్పిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ అంత కూడా సరదాగా సాగుతూ, ముఖ్యంగా క్లైమాక్స్ బాగా తీసాడు. అలాగే దర్శకుడు మొదటి సగం లో కొన్ని సన్నివేశాలను సాగదీసాడు కూడా. వదిన, మరిది ల  మధ్య జరిగే సన్నివేశాలు కొంచెం ఓవర్ గా వున్నా, దర్శకుడు వాళ్ళు ఓవర్ ఆక్షన్ చేస్తున్నారని ఇంకొకరితో సెటైర్ గా చెప్పించటం కూడా బాగుంది. మొదటి సగం లో దర్శకుడు ఇంకా కొంచెం దృష్టి పెట్టి ఉంటే, సినిమా అసలు ఇంకో బాగా వచ్చేది. కొన్ని సన్నివేశాలు చూస్తూనే ఇవన్నీ ఎక్కడో చూసినట్టుగా అనిపించినా, సరదాగా ఉండటం తో సాగిపోతుంది. 


ఇంక నటీనటుల విషయాన్ని వస్తే, ఆది సాయి కుమార్ లుక్ (Aadi Saikumar new look is good) చాల బావుంది. ఈ కొత్త లుక్ తో రావటం వల్ల నటనలో కూడా ఇంతకు ముందు సినిమాలకీ ఈ సినిమాకీ చాలా తేడా కనిపించింది. ఆ క్యారెక్టర్ కి బాగా గా సూట్ అయ్యాడు ఆది, అంతే హైపర్ ఆక్టివ్ గా చేసాడు కూడా. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా బాగానే చేసాడు  అలాగే తనలో మంచి కామెడీ టైమింగ్ వుంది అని ఈ సినిమాతో ప్రూవ్ చేసాడు ఆది. మంచి సినిమా అవుతుంది అతనికి. ఇంకా కథానాయకుల విషయానికి వస్తే దిగంగనా (Digangana) సూర్యవన్షి కి మంచి పాత్ర దొరికింది ఆమె దానికి తగినట్టు చేసింది. అలాగే సెకండ్ హాఫ్ లో వస్తుంది  మిర్నా మీనన్ (Mirna Menon). ఈమె కొంచెం గ్లామరస్ గా వుంది. నర్రా శ్రీనివాస్ (Narra Srinivas) ఫస్ట్ హాఫ్ లో తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తాడు. నర్రా, ఆది మధ్య వచ్చే సీన్స్‌లో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. మరో కామెడీ యాక్టర్ సప్తగిరి (Saptagiri) వున్నాడు కానీ, అతన్ని సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది. అనీష్ కురువిల్లా (Aneesh Kuruvilla) మరోసారి తన పాత్రకు తగినట్లు బాగా చేసాడు. హీరో వదినగా నటించిన వినోదిని వైద్యనాథ్ (Vinodini Vaidyanath) మొదట్లో కొంచెం ఇబ్బడిగా అనిపించినా, చివర్లో మాత్రం ఆమె హైలైట్ అయి ఆమె ఒక రిలీఫ్ లాగా ఆమె సీన్స్ ఉంటాయి. 


చివరగా, 'క్రేజీ ఫెలో' ఆది సాకుకుమార్ కి మంచి పేరు తీసుకువస్తుంది. ఆది లుక్, స్టైల్ మార్చి కొత్త గా సినిమాలో కనిపిస్తాడు. అలాగే కామెడీ కూడా బాగా పండింది. చిన్న ఎంటర్ టైన్ మెంట్ కావాలనుకునే వాళ్ళు ఈ సినిమాకి ఇంల్తో అందరితో పాటు వెళ్లి చూడొచ్చు. ఈ సినిమా ఎవరినీ నిరాశ పర్చాడు. ముఖ్యంగా ఆది సాయికుమార్ చాల రోజుల నుంచి ఎదురుచూస్తున్న బ్రేక్ ఈ సినిమాతో అతనికి వస్తుందని అనుకుంటున్నా. (Crazy Fellow is a watchable film)

Updated Date - 2022-10-14T20:22:14+05:30 IST

Read more