ఆడవాళ్ల రాజ్యంలో...

ABN , First Publish Date - 2022-02-20T06:17:03+05:30 IST

శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’. కిషోర్‌ తిరుమల దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. మార్చి 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.....

ఆడవాళ్ల రాజ్యంలో...

శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’. కిషోర్‌ తిరుమల దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. మార్చి 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆడవాళ్లున్న రాజ్యంలో పుట్టి, పెరిగిన ఓ అబ్బాయి కథ ఇది. తన పెళ్లి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి సీనియర్‌ నటీమణులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. టైటిల్‌ సాంగ్‌ అయితే మార్మోగిపోతోంది. ఇంటిల్లిపాదీ చూసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయ’’న్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Updated Date - 2022-02-20T06:17:03+05:30 IST