‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. విడుదల తేదీ ఖరారు

ABN , First Publish Date - 2022-01-28T23:58:16+05:30 IST

యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ప్రస్తుతం తుది దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ప్రస్తుతం తుది దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ నటీమణులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నాం. ప్రస్తుతం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. శర్వానంద్, రష్మిక జోడికి మంచి మార్కులు పడ్డాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అద్బుతమైన సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నాం..’’ అని తెలిపారు. 

Updated Date - 2022-01-28T23:58:16+05:30 IST