సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aa Ammayi Gurinchi Meeku Cheppali: విడుదల తేదీ ఖరారు..

ABN, First Publish Date - 2022-08-10T18:47:18+05:30

సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna indraganti) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna indraganti) దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' (Aa Ammayi Gurinchi Meeku Cheppali). ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్ తో సినిమాపై మంచి ఆసక్తిని పెంచారు. ఇన్నాళ్లు మంచి సోలో డేట్ కోసం ఎదురు చూసిన దర్శకనిర్మాతలు ఎట్టకేలకి సెప్టెంబర్ 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. 


సుధీర్ బాబు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీగా ఆడుతున్నాయి. ఆయనతో సినిమా చేస్తే నిర్మాతలు సేఫ్ అనేట్టుగానే వసూళ్ళు వస్తున్నాయి. ఈ క్రమంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రాన్ని భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధం చేస్తున్నారు. గత కొంతకాలంగా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణకి సరైన సక్సెస్ దక్కలేదు. దాంతో ఇప్పుడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.


ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ తో టాక్ పాజిటివ్‌గానే వినిపిస్తోంది. ఇక ఇందులో హీరోయిన్ కృతి శెట్టి కాబట్టి మరింత బజ్ క్రియేట్ అయింది. ఈ వారం మాచర్ల నియోజక వర్గం సినిమాతో కృతి శెట్టి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నెల రోజుల గ్యాప్ లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో, అటు హీరో సుధీర్ బాబు ఇటు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఖాతాలో హిట్ చేరుతుందో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. 

Updated Date - 2022-08-10T18:47:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!