ప్రేమికులకు కనెక్ట్‌ అయ్యే పాట

ABN , First Publish Date - 2022-05-08T05:54:54+05:30 IST

‘ఉప్పెన’ సినిమాతో అందరి దృష్టినీ ఆకట్టుకొన్న యువ కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ జులై ఒకటిన విడుదల...

ప్రేమికులకు కనెక్ట్‌ అయ్యే పాట

‘ఉప్పెన’ సినిమాతో అందరి దృష్టినీ ఆకట్టుకొన్న యువ కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ జులై ఒకటిన విడుదల కానుంది. తమిళంలో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి దర్శకత్వం వహించిన  గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కేతికా శర్మ ఈ చిత్ర కథానాయిక. ఈ సినిమాలోని డ్యూయెట్‌ సాంగ్‌ ‘కొత్తగా  లేదేంటి’ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అర్మాన్‌ మాలిక్‌, హరిప్రియ పాడిన ఈ పాటను శ్రీమణి రాశారు. ప్రేమికులకు కనెక్ట్‌ అయ్యేలా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.


Updated Date - 2022-05-08T05:54:54+05:30 IST

Read more