గ్రామీణ ప్రేమకథ

ABN , First Publish Date - 2022-12-25T01:45:53+05:30 IST

నూతన జంట మహేశ్‌, భూమిక కాంబినేషన్‌లో గోల్డెన్‌ సినీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్‌ శనివారం...

గ్రామీణ ప్రేమకథ

నూతన జంట మహేశ్‌, భూమిక కాంబినేషన్‌లో గోల్డెన్‌ సినీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్‌ శనివారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నిర్మాత సుజాత కెమెరా స్విచాన్‌ చేయగా, మరో నిర్మాత శోభన్‌బాబు తొలి క్లాప్‌ ఇచ్చారు. సజ్జా కుమార్‌ దర్శకత్వంలో సుజాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ సినిమా ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం, పేరుపాలెం బీచ్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తామని, జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందనీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శోభన్‌బాబు చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇదని దర్శకుడు చెప్పారు.

Updated Date - 2022-12-25T01:45:53+05:30 IST

Read more