ఆహ్లాదకరంగా సాగిపోయే ఆకాశం

ABN , First Publish Date - 2022-11-02T10:06:17+05:30 IST

ఆశోక్‌ సెల్వన్‌, రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఆకాశం’. ఆర్‌.ఎ.కార్తీక్‌ దర్శకుడు....

ఆహ్లాదకరంగా సాగిపోయే ఆకాశం

ఆశోక్‌ సెల్వన్‌, రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఆకాశం’. ఆర్‌.ఎ.కార్తీక్‌ దర్శకుడు. వయాకామ్‌ 18, రైజ్‌ ఈస్ట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 4న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ ‘‘నేను నటించిన ‘నిన్నలా నిన్నలా..’ తెలుగులో మంచి విజయాన్ని అందుకొంది. తమిళంలో చేసిన ‘ఓ మై కడవులే’ చూసి మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశారు. ఈ సినిమాకు నాని అందించిన సహకారం మర్చిపోలేనిది. తెలుగులో నేరుగా ఓ మంచి సినిమా చేయాలన్న కోరిక ‘ఆకాశం’తో తీరింద’’న్నారు. ‘‘ఇదో ఫీల్‌ గుడ్‌ మూవీ. ఆహ్లాదభరితంగా సాగిపోతుంద’’న్నారు దర్శక నిర్మాతలు. 


Updated Date - 2022-11-02T10:06:17+05:30 IST

Read more