ఓ మెకానిక్ సందేశం
ABN , First Publish Date - 2022-08-16T05:39:04+05:30 IST
మనసాయి తేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అనేది ఉపశీర్షిక. రేఖ నిరోషా కథానాయిక...
మనసాయి తేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అనేది ఉపశీర్షిక. రేఖ నిరోషా కథానాయిక. ముని సహేకర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మున్నా, ఉపేందర్ నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. నిరంతరం ఎదుర్కొంటున్న ఓ సమస్యని ఇందులో చర్చిస్తున్నాం. సందేశాత్మకంగా ఉంటుంద’’న్నారు నిర్మాతలు. తనికెళ్ల భరణి, నాగ మహేశ్, సూర్య దొరబాబు తదితరులు నటిస్తున్నారు. సంగీతం: వినోద్ యాజమాన్య.