మ్యాజిక్‌ చేసే సినిమా

ABN , First Publish Date - 2022-10-14T06:44:26+05:30 IST

‘‘క్రేజీఫెలో’ సినిమాలో మ్యాజిక్‌ ఉంది. మంచి ఎంటర్టైనర్‌ మూవీ చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమా బాగుందని ప్రేక్షకులే పదిమందికి చెబుతారనే నమ్మకం ఉంద’న్నారు’...

మ్యాజిక్‌ చేసే సినిమా

‘‘క్రేజీఫెలో’ సినిమాలో మ్యాజిక్‌ ఉంది. మంచి ఎంటర్టైనర్‌ మూవీ చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమా బాగుందని ప్రేక్షకులే పదిమందికి చెబుతారనే నమ్మకం ఉంద’న్నారు’ ఆది సాయికుమార్‌. 

ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆది పంచుకున్న సినిమా విశేషాలు. 


దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నారు. చాలా బాగా తెరకెక్కించారు. కె. కె రాధామోహన్‌ గారికి కథ బాగా నచ్చి, ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. 


చాలామంది ‘లవ్లీ’, ‘ప్రేమ కావాలి’ లాంటి  సినిమాలు చేయమని అడుగుతున్నారు. ఈ సినిమా ఆ తరహాలో ఉంటుంది. ఇద్దరు హీరోయిన్లు దిగంగన సూర్యవంశీ, మిర్నా అద్భుతంగా చేశారు. 


ఇందులో నా పాత్ర చాలా క్రేజీగా ఉంటుంది. తొందరపాటు క్యారెక్టర్‌. చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొనితెచ్చుకుంటాను. మిగతా పాత్రలు కూడా చాలా బావుంటాయి. ప్రతి క్యారెక్టర్‌లో ఫ్రెష్‌నెస్‌ ఉంటుంది. ఆర్‌ . ఆర్‌ ధ్రువన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. పాటలన్నీ బావుంటాయి. 

Updated Date - 2022-10-14T06:44:26+05:30 IST

Read more