యువత మెచ్చే ప్రేమకథ
ABN , First Publish Date - 2022-12-31T02:00:48+05:30 IST
ఒన్ మీడియా ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఒన్ మీడియా ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జానీ బాషా దర్శకత్వం వహిస్తున్నారు. పార్థురెడ్డి నిర్మాత. యువతను ఆకట్టుకునే ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది, త్వరలో టైటిల్‌ను ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. హైదరాబాద్, వైజాగ్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని చిత్ర దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కారే సతీ్‌షకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.