కొంచెం తీపి.. కొంచెం వగరు!

ABN , First Publish Date - 2022-11-15T05:54:55+05:30 IST

జీవిత్రం షడ్రుచుల సోపానం. అలా ఉంటేనే... ప్రయాణం పరిపూర్ణమైనట్టు. ఓటమి బాధ తెలియకపోతే.. విజయంలో ఉన్న రుచి కూడా అర్థం కాదు...

కొంచెం తీపి.. కొంచెం వగరు!

జీవిత్రం షడ్రుచుల సోపానం. అలా ఉంటేనే... ప్రయాణం పరిపూర్ణమైనట్టు. ఓటమి బాధ తెలియకపోతే.. విజయంలో ఉన్న రుచి కూడా అర్థం కాదు. సినిమాల్లోనూ అంతే. కొన్ని హిట్లూ.. కొన్ని ఫ్లాపులూ.. బండి ఇలా సాగాల్సిందే. కీర్తి సురేశ్‌ కూడా ఇదే మాట చెబుతోంది. ‘‘ప్రతీ సినిమా హిట్టయితే... కొన్నాళ్లకు విజయం అంటేనే విరక్తి వస్తుందేమో.? అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తినాలి. అప్పుడే కదా..? విజయం అంటే ఏమిటో అర్థం అయ్యేది. కొంచెం తీపి, కొంచెం వగరు.. ఇలా అన్ని రుచుల్నీ ఆస్వాదించాల్సిందే. నేను కూడా అదే మైండ్‌ సెట్‌తో ఉన్నాను. ఓ ఫ్లాపు వస్తే ఎప్పుడూ భయపడిపోను. ఎందుకంటే.. మనల్ని మనం అప్రమత్తం చేసుకోవడానికి అదో అవకాశం అనుకొంటా. నా అదృష్టం కొద్దీ... ప్రతీ సినిమాలోనూ నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నా. ‘కీర్తి వల్లే ఈ సినిమా పోయింది’ అని ఎవరూ అనలేదు. నావల్లే సినిమా ఆడిందని నేను కూడా ఎప్పుడూ సంబరపడిపోలేదు. హిట్‌ సినిమాలో కొన్ని మైనస్సులు ఉంటాయి. ఫ్లాప్‌లో కొన్ని ప్లస్సులూ కనిపిస్తాయి. అలాంటి పాజిటివ్‌ మైండ్‌ సెట్‌తో నా సినీ ప్రయాణాన్ని తీర్చిదిద్దుకొంటున్నా’’ అని  చెప్పుకొచ్చారు. చిరంజీవి ‘భోళా శంకర్‌’లో కీర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నాని ‘దసరా’లో తనే కథానాయిక. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. 


Updated Date - 2022-11-15T05:54:55+05:30 IST

Read more