కొంచెం క్రేజీ... క్రేజీగా!

ABN , First Publish Date - 2022-10-03T05:56:20+05:30 IST

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశీ కథానాయిక...

కొంచెం క్రేజీ... క్రేజీగా!

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశీ కథానాయిక. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఆదివారం ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈనెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే క్రేజీ క్రేజీగా సాగిపోయే సినిమా ఇది. వినోదం, ప్రేమ, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలూ పొందుపరిచాం. యువతరానికి బాగా నచ్చుతుంది. ట్రైలర్‌కి వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైలర్‌తో అంచనాలు మరింతగా పెరిగాయ’’న్నారు. సంగీతం: ఆర్‌.ఆర్‌. ధ్రువన్‌.


Updated Date - 2022-10-03T05:56:20+05:30 IST

Read more