సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Balakrishna : బాధలో ఉన్న బాలయ్యను సెల్ఫీ అడిగిన అభిమాని..

ABN, First Publish Date - 2022-08-03T18:45:49+05:30

సినీ సెలబ్రిటీ కనిపిస్తే .. అభిమానులు సెల్ఫీ అడగడం సర్వసాధారణం. అయితే తాము ఏ పరిస్థితుల్లో సెల్ఫీ అడుగుతున్నామనే స్పృహ కూడా లేకుండా కొందరు ప్రవర్తిస్తుండడం విచారకరం. సోమవారం టాలీవుడ్ లెజెండరీ దివంగత నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె, బాలక‌ృష్ణ చెల్లెలు ఉమా మహేశ్వరి మరణించిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ సెలబ్రిటీ కనిపిస్తే .. అభిమానులు సెల్ఫీ అడగడం సర్వసాధారణం. అయితే తాము ఏ పరిస్థితుల్లో సెల్ఫీ అడుగుతున్నామనే స్పృహ కూడా లేకుండా కొందరు ప్రవర్తిస్తుండడం విచారకరం. సోమవారం టాలీవుడ్ లెజెండరీ దివంగత నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె, బాలక‌ృష్ణ చెల్లెలు ఉమా మహేశ్వరి మరణించిన సంగతి తెలిసిందే.


ఈ క్రమంలో ఉమా మహేశ్వరి స్వగృహంలో ఉన్న ఆమె పార్ధిక దేహాన్ని సందర్శించేందుకు నందమూరి బాలకృష్ణ జూబ్లీ‌హిల్స్ లోని ఆమె ఇంటికి వెళ్ళారు. మీడియా వారు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బాలయ్య ఉమా మహేశ్వరి పార్ధివ దేహాన్ని సందర్శించి.. తన కారు ఎక్కడబోతుండగా.. అక్కడే ఉన్న ఓ అభిమాని ఆయన్ను సెల్ఫీ అడిగాడు. వెంటనే ఆయన ఆ అభిమానివైపు సైలెంట్ గా చూసి కారెక్కి వెళ్లిపోయారు. పరిస్థితిని అర్ధం చేసుకోకుండా.. ఆ విధంగా సెల్ఫీ అడగడం కరెక్ట్ కాదని, సమయం, సందర్బం చూడకుండా కొన్ని సార్లు అభిమానులు ఏవిధంగా ప్రవర్తిస్తారో అర్ధం కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసి ఆ అభిమానిపై మండిపడుతున్నారు నెటిజెన్లు. 

Updated Date - 2022-08-03T18:45:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!