ఫొటో స్టూడియో చెప్పే క్రైమ్‌ కథ

ABN , First Publish Date - 2022-12-28T02:42:57+05:30 IST

పెళ్లిచూపులు’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘దొరసాని’ లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ బిగ్‌బెన్‌ సినిమాస్‌. తమ బేనర్‌లో రూపొందుతున్న నూతన చిత్రానికి ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది.

ఫొటో స్టూడియో చెప్పే  క్రైమ్‌ కథ

‘పెళ్లిచూపులు’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘దొరసాని’ లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ బిగ్‌బెన్‌ సినిమాస్‌. తమ బేనర్‌లో రూపొందుతున్న నూతన చిత్రానికి ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. ‘ఇచ్చట అందంగా ఫొటోలు తీయబడును’ అనేది క్యాప్షన్‌. ఈ చిత్రంలో చైతన్యరావ్‌, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఓ పిట్టకథ’ చిత్రంతో పేరుతెచ్చుకున్న చందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌ రంగినేని నిర్మాత. ఈ చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్‌, టైటిల్‌ను దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో అనే టైటిల్‌, ఇచ్చట అందంగా ఫొటోలు తీయబడును అనే క్యాప్షన్‌ ఆకట్టుకున్నాయ’న్నారు. చందు ముద్ద మాట్లాడుతూ ‘80వ దశకం నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగే క్రైమ్‌ కామెడీ చిత్రం ఇది. ప్రేక్షకులకు నచ్చుతుంద’న్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రిన్స్‌ హెన్రీ. సినిమాటోగ్రఫీ: పంకజ్‌ తొట్టాడ.

Updated Date - 2022-12-28T02:42:57+05:30 IST

Read more