ఓ సరికొత్త ప్రేమకథ

ABN , First Publish Date - 2022-01-22T05:45:16+05:30 IST

అజయ్‌, వీర్తి వఘాని జంటగా నటించిన చిత్రం ‘కొత్త కొత్తగా’. ఆనంద్‌, తులసి, కాశీ విశ్వనాథ్‌ కీలక పాత్రలు పోషించారు...

ఓ సరికొత్త ప్రేమకథ

అజయ్‌, వీర్తి వఘాని జంటగా నటించిన చిత్రం ‘కొత్త కొత్తగా’. ఆనంద్‌, తులసి, కాశీ విశ్వనాథ్‌ కీలక పాత్రలు పోషించారు. హనుమాన్‌ వాసంశెట్టి దర్శకుడు. మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం ప్రముఖ దర్శకుడు మారుతి చేతుల మీదుగా ‘డైమండ్‌ రాణి’ అనే పాటని విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రచించిన ఈ గీతాన్ని అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. శేఖర్‌ చంద్ర స్వరాలు అందించారు. ‘‘ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. పాటలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని నిర్మాత తెలిపారు.

Updated Date - 2022-01-22T05:45:16+05:30 IST