సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బోల్డ్‌ సబ్జెక్ట్‌తో...

ABN, First Publish Date - 2022-02-08T05:30:00+05:30

‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’ ఫేం సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’ ఫేం సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో వి. బాపిరాజు, ముతికి నాగసత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ు 69 సంస్కార్‌ కాలనీ’. అజయ్‌, ఏస్తేర్‌, భద్రం, రిష్విక్‌ కీలకపాత్రలు పోషించారు. త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం విశేషాలను దర్శక నిర్మాతలు వెల్లడించారు. ‘పత్రికల్లో వచ్చిన ఓ యథార్థ గాథ  ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫిబ్రవరి మూడో వారంలో సినిమాను విడుదల చేస్తాం’ అని వి. బాపిరాజు అన్నారు. సునీల్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ‘ఆధునిక సమాజంలో మానవ సంబంధాల్లో వస్తున్న పెడ ధోరణుల నేపథ్యంలో ఈ సినిమా తీశాం. బోల్డ్‌ సబ్జెక్ట్‌ అయినా బాధ్యతతో తీసిన సినిమా ఇద’న్నారు. ఈ చిత్రానికి గాయత్రి స్వాతి మూలకథను అందించారు.

Updated Date - 2022-02-08T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!