సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

68th National Film Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా..

ABN, First Publish Date - 2022-10-01T03:13:33+05:30

68వ జాతీయ పురస్కార ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలోని విఘ్నయన్‌ భవన్‌లో వైభవంగా జరిగింది. భారతీ చలన చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవార్డుల ప్రదానం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

68వ జాతీయ పురస్కార ప్రదానోత్సవం (68th National Film Awards)దేశ రాజధాని ఢిల్లీలోని విఘ్నయన్‌ భవన్‌లో వైభవంగా జరిగింది. భారతీ చలన చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా ఆవార్డుల ప్రదానం జరిగింది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జి.ఆర్‌.గోపినాథ్‌ జీవిత కథను ఆధారంగా సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన ‘సూరరై పోట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో హీరోగా నటించిన సూర్య (Suriya)ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి (Aparna bala murali) ఉత్తమ నటిగా పురస్కారాలు వరించాయి. హిందీ చిత్రం ‘తాన్హాజీ’లో టైటిల్‌ పాత్ర పోషించిన అజయ్‌ దేవగణ్‌(Ajay devagan), ‘సూరరై పోట్రు’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా సూర్య అవార్డును అందుకున్నారు. 




యువ నటీనటులు, యువ దర్శకుడు సందీప్‌ రాజ్‌ (Sandeep raj)తెరకెక్కించిన ‘కలర్‌ ఫొటో’ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో అవార్డ్‌ అందుకుంది. కరోనా వల్ల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొంది జాతీయ పురస్కారానికి ఎంపికైంది. శుక్రవారం చిత్ర దర్శకుడు సందీప్‌ రాజ్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే సంప్రదాయ నృత్యం నేపథ్యంలో రూపొందిన ‘నాట్యం’ చిత్రం ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. ఈ చిత్ర నటి, నిర్మాత సంధ్యారాజు (Sandhya raju) అవార్డును అందుకున్నారు. హుషారైన పాటలతో అలరించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం మ్యూజిక్‌ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంది. 








Updated Date - 2022-10-01T03:13:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!