బాడీలో 47 బుల్లెట్లు దిగినా.. నేను బతికింది ప్రజల కోసమే
ABN , First Publish Date - 2022-01-27T05:39:11+05:30 IST
‘ఆర్జీవీకి నేను రెండు ముక్కలు చెబితే.. ఆయన వంద మందిని ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఈ సినిమా తీశారు. రెండు నెలల పదహారు రోజులు ఆయన వరంగల్‌లోనే ఉండి ఈ సినిమా తీశారు...

‘ఆర్జీవీకి నేను రెండు ముక్కలు చెబితే.. ఆయన వంద మందిని ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని ఈ సినిమా తీశారు. రెండు నెలల పదహారు రోజులు ఆయన వరంగల్‌లోనే ఉండి ఈ సినిమా తీశారు. ఇదే జనవరి 26న నా మీద 47 బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. అయినా నేను బతికింది మా కుటుంబం కోసం కాదు.. ప్రజల కోసమే’ అన్నారు కొండా మురళి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా మురళి, సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘కొండా’ చిత్రం ట్రైలర్‌ను బుధవారం హనుమకొండలో విడుదల చేశారు. ఇందులో కొండా మురళీగా త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘మురళీ చెప్పిన విషయాలను రెండు గంటల సినిమాగా తీయడం చాలా కష్టం. అందులో కొన్ని విషయాలు తీసుకుని ఈ సినిమా చేశాను. ‘కొండా’ వయలెంట్ క్రైమ్ డ్రామా అయినా, ఇందులో స్ట్రాంగ్ లవ్ స్టోరీ కూడా ఉంది. ‘కొండా 2’లో మురళీ, సురేఖ దంపతుల కుమార్తె సుస్మిత పాత్ర ఉంటుంది. నా కెరీర్‌లో డిఫరెంట్, గుడ్ ఫిల్మ్ తీశానని నమ్మకం ఉంది. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మార్చిలో విడుదల చేస్తాం’ అని చెప్పారు. ఈ ట్రైలర్ చూశాక తామెంత బాధ అనుభవించామనేది గుర్తొచ్చిందని కొండా సురేఖ చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న త్రిగుణ్, ఇర్రా మోర్ తమ అనుభవాలు వివరించారు.