సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రామ్‌చరణ్‌కు 4, ఎన్టీఆర్‌కు 8 ఫస్ట్‌ ర్యాంక్‌ ధను్‌షదే!

ABN, First Publish Date - 2022-12-08T10:32:15+05:30

హీరోహీరోయిన్లకు అభిమానులు ఇచ్చే రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ప్రతి ఏడాది చివరిలో ర్యాంకులు ప్రకటిస్తుంటుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోహీరోయిన్లకు అభిమానులు ఇచ్చే రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ప్రతి ఏడాది చివరిలో ర్యాంకులు ప్రకటిస్తుంటుంది. బుధవారం ‘మోస్ట్‌  పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ ఆఫ్‌ ఇండియా  2022’ జాబితాను ప్రకటించింది. మొదటి స్థానంలో తమిళ హీరో ధనుష్‌ నిలిచారు. అలియా భట్‌ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానం ఐశ్యర్యా రాయ్‌ పొందారు. ఇక మన తెలుగు హీరోల్లో రామ్‌చరణ్‌ నాలుగోస్థానంలో నిలవగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు. అల్లు అర్జున్‌కు తొమ్మిదో స్థానం లభించింది. సమంత, హృతిక్‌ రోషన్‌, కియారా అడ్వాణీ ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ‘కేజీఎఫ్‌ 2’ చిత్రంలో నటించిన యష్‌ తొలిసారిగా ఐఎండీబీలో ఖాతా తెరిచారు. ఆయనకు పదో ర్యాంక్‌ లభించింది. ఐఎండీబీ ర్యాంకుల్లో దక్షిణాది తారల హవా స్పష్టంగా కనిపిస్తుండడం ఈ సారి విశేషం.


Updated Date - 2022-12-08T10:32:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!