సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘1996 ధర్మపురి’ ట్రైలర్ వదిలిన డైరెక్టర్ మారుతి

ABN, First Publish Date - 2022-04-13T02:13:18+05:30

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘1996 ధర్మపురి’. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గగన్ విహారి, అపర్ణ దేవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘1996 ధర్మపురి’. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా నటించిన ఈ చిత్రం 1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు జగత్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు మారుతి చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ 1996 ధర్మపురి..’. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


ట్రైలర్ విడుదల అనంతరం డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. 1996 ధ‌ర్మ‌పురి చిత్ర ద‌ర్శ‌కుడు జ‌గ‌త్ నా ద‌గ్గ‌ర చాలా చిత్రాలకి సహ ద‌ర్శ‌కుడిగా చేశాడు. మొట్ట‌మొద‌టి సారిగా ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది. అలాగే ఈ చిత్రానికి శేఖ‌ర్ మాస్ట‌ర్ స‌మ‌ర్ప‌ణ చేయ‌డం మా జగత్‌కి చాలా హెల్ప్ అయ్యింది. నేను 1996 ధ‌ర్మ‌పురి చిత్రాన్ని చూశాను. ఈ చిత్రాన్ని చాలా రియ‌లిస్టిక్‌గా నేచుర‌ల్‌గా తీశారు. ఈ చిత్రం అందరినీ థ్రిల్ చేస్తుందని నమ్ముతున్నాను. ట్రైల‌ర్ నాకు బాగా న‌చ్చింది. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని, సినిమా ఘనవిజయం సాధించాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.


చిత్ర స‌మ‌ర్ప‌కుడు శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు జ‌గ‌త్ క‌థ చెప్పిన‌రోజే చెప్పాను ఈ సినిమా అంద‌రి హృద‌యాల‌కి ద‌గ్గ‌ర‌వుతుంద‌ని, అందుకే నేను ఈ చిత్రంలో పార్ట‌య్యాను. ప్రేక్ష‌కుల నాడి తెలిసిన ద‌ర్శ‌కుడైన మారుతిగారికి ఈ సినిమా న‌చ్చ‌డం అంటే తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి సినిమా న‌చ్చుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను. ఈ చిత్రం చాలా రియ‌లిస్టిక్‌గా చాలా నేచుర‌ల్ ఫెర్‌ఫార్మెన్స్‌తో ప్ర‌తి ఓక్క‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగా రాశారు. సాంగ్స్ విష‌యానికొస్తే ఇప్ప‌టికే రెండు సాంగ్స్ ప్రేక్ష‌కులకి నచ్చేశాయి. సినిమా ఎండ్ కార్డ్ ప‌డ్డాక సూరి, మ‌ల్లి పాత్ర‌లు మీతోనే థియేట‌ర్ బ‌య‌ట‌కి ట్రావెల్ అవుతాయి. ఓషో వెంక‌టేష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా పెద్ద మ్యాజిక్ చేసింది. ఏప్రిల్ 22 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం..’’ అని అన్నారు. 



Updated Date - 2022-04-13T02:13:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!