Worst Dressed: చెత్త డ్రెస్సింగ్‌తో విమర్శల పాలైన నటులు వీరే..

ABN , First Publish Date - 2022-11-28T21:16:47+05:30 IST

దేశవ్యాప్తంగా సినీ, టీవీ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఆ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లిన అందరి దృష్టి వారిపైనే ఉంటుంది...

Worst Dressed: చెత్త డ్రెస్సింగ్‌తో విమర్శల పాలైన నటులు వీరే..

దేశవ్యాప్తంగా సినీ, టీవీ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఆ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లిన అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. అందుకే వారు బయటికి వెళ్లేందుకు డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా సార్లు వారి ఫ్యాషన్ సెన్స్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. కానీ.. కొన్నిసార్లు వారి డ్రెస్సింగ్ సెన్స్‌తో విమర్శల పాలు అవుతుంటారు. తాజాగా అలా విమర్శలపైనా పలువురి యాక్టర్స్ గురించి తెలుసుకుందాం..


సోనమ్ కపూర్ (Sonam Kapoor)

కొడుకు వాయు పుట్టిన తర్వాత సోనమ్ కపూర్ ఇంటి నుంచి బయటికి రావడం స్టార్ట్ చేసింది. ఇటీవలే జరిగిన ఓ ఈవెంట్‌ కోసం ఇటాలియన్ బ్రాండ్ అయిన టాలర్ మార్మో బ్రాండ్‌కి చెందిన నీలిరంగు డ్రెస్ ధరించింది. అయితే ఆ డ్రెస్సింగ్ సెన్స్‌లో విచిత్రం కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


సారా అలీ ఖాన్ (Sara Ali Khan)

సారా అలీ ఖాన్ ఒక ఈవెంట్ కోసం ఈ ఎరుపు, నలుపు రంగు కలగలిపిన దుస్తులు ధరించారు. అది ఆమెకి అంతగా నప్పలేదు. దీంతో పలువురు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై కామెంట్స్ చేశారు.




అవ్‌నీత్ కౌర్ (Avneet Kaur)

టీవీ నటి, వైరల్ సెన్సేషన్ అయిన అవ్‌నీత్ కౌర్ ఈ మినీ డ్రెస్‌లో భేదియా స్క్రీనింగ్‌కు వచ్చింది. ఫిట్, స్టైలింగ్ చాలా డీసెంట్‌గా ఉన్నాయి. కానీ ఆ కార్సెట్ స్టైల్ డిజైన్‌పై ఉన్న షిఫాన్ అస్సలు బాగా లేదు. అది కొంచెం వెరైటీగా కనిపించింది.





Updated Date - 2022-11-28T21:16:47+05:30 IST