సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

లతాజీ వందల కోట్ల ఆస్తులు ఎవరికి..? వీలునామాలో ఏం రాశారు..?

ABN, First Publish Date - 2022-02-08T01:26:37+05:30

లతా మంగేష్కర్ గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. గాన మాధుర్యానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లతా మంగేష్కర్ గొంతెత్తి పాడితే సినీ ప్రియులు పులకరించిపోయారు. గాన మాధుర్యానికి పరవశించారు. ఎందుకంటే ఆమె గొంతులో అమృతం​ ఉంది. ఆ గొంతుకు అన్ని రకాల భావాలను పలికించగల సామర్థ్యం ఉంది. గాన కోకిల స్వరం నుంచి వేలల్లోనే పాటలు జాలువారాయి. తాజాగా ఆ స్వరం ఏ పాట పాడనంటూ శాశ్వతంగా మూగబోయింది. ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో లతా మంగేష్కర్‌ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. వివిధ భాషల్లో దాదాపుగా 50వేలకు పైగా పాటలను ఆమె పాడారు. సినీ ఇండస్ట్రీలోనే స్టార్‌ గాయనిగా లతాజీ రెమ్యునరేషన్‌ కూడా అత్యధికంగానే తీసుకునేవారట. ఆమె ఆస్తుల విలువ దాదాపుగా రూ. 200 కోట్లకు పైగా ఉంటుందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.


సాధారణంగా ఎవరైనా మరణిస్తే వారి ఆస్తులు వారసులకు చెందుతాయి. కానీ, లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమెకు వారసులు లేరు. ఆమె చెల్లెల్లు ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు ఆ ఆస్తులు చెందుతాయని కొందరు వాదిస్తున్నారు. తన తండ్రి కట్టించిన ట్రస్ట్‌కు కూడా లతాజీ ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరణానంతరం ఆస్తులు ఎవరి పేరుపై ఆమె రాశారనేది ఇప్పటి వరకు తెలియలేదు. లాతాజీ ఆస్తులపై ఆమె లాయరు త్వరలోనే ఓ  ప్రకటన జారీ చేయనున్నాడని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఆమె పాడిన పాటలకే రాయల్టీ ద్వారా ఏడాదికి దాదాపు‌గా రూ.5 కోట్ల పైగానే ఆదాయం వస్తోందని తెలుస్తోంది. 

Updated Date - 2022-02-08T01:26:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!