Vivek Oberoi: సినీ ఇండస్ట్రీ క్రూరం, ఘోరం

ABN , First Publish Date - 2022-12-18T21:04:07+05:30 IST

బాలీవుడ్‌లోని ప్రముఖ నటుల్లో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) ఒకరు. ‘కంపెనీ’, ‘ఓంకార’, ‘షూట్ అవుట్ ఎట్ లోఖండ్ వాలా’ తదితర సినిమాలతో

Vivek Oberoi: సినీ ఇండస్ట్రీ క్రూరం, ఘోరం

బాలీవుడ్‌లోని ప్రముఖ నటుల్లో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) ఒకరు. ‘కంపెనీ’, ‘ఓంకార’, ‘షూట్ అవుట్ ఎట్ లోఖండ్ వాలా’ తదితర సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. సౌత్‌కు చెందిన చిత్రాల్లోను విలన్‌గా నటించాడు. ‘లూసిఫర్’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో దక్షిణాది వారికి కూడా చేరువయ్యాడు. కెరీర్‌లో వివేక్ ఎన్నో ఆటుపోట్లును ఎదుర్కొన్నాడు. తన కెరీర్‌లోని చీకటి దశను తాజాగా మీడియాతో పంచుకున్నాడు.

‘‘సినీ ఇండస్ట్రీ క్రూరంగా, ఘోరంగా ఉంటుంది. కొన్ని సార్లు నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. కుటుంబ సభ్యుల ఆశీస్సుల వల్లనే ప్రస్తుతం నేను ఈ విధంగా ఉన్నాను. లేకపోతే సినీ ఇండస్ట్రీలో కనిపించకపోయేవాడిని. నా చుట్టు ఎప్పుడు నెగెటివిటీ ఉండేది. ఫలితంగా నేను బాధలో ఉండేవాడిని. మన చుట్టు ఉన్న కొంత మంది మానసిక స్థైర్యం కొల్పోయేలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, నా భార్య ప్రియాంక కెరీర్‌లో ఎంతగానో తోడ్పాటును అందించింది. సుశాంత్ సింగ్ మరణంతో నన్ను నేను రిలేట్ చేసుకున్నాను. ఆ బాధను నేను కూడా అనుభవించాను’’ అని వివేక్ ఒబెరాయ్ చెప్పాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. వివేక్ ఒబెరాయ్ ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’, ‘ధారావి బ్యాంక్’ వంటి వెబ్ షోల్లో నటించాడు. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ పోలీస్ పోర్స్‌’ (Indian Police Force)లో కీలక పాత్రను పోషిస్తున్నాడు.

Updated Date - 2022-12-19T09:58:39+05:30 IST