Vivek Oberoi: ఆ రెండింటి తర్వాత సాఫీగా సాగలేదు!

ABN , First Publish Date - 2022-12-16T17:19:34+05:30 IST

‘కంపెనీ’, ‘సాధియా’ చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందారు వివేక్‌ ఒబెరాయ్‌. ఈ రెండు చిత్రాలు విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ఛానల్‌తో మాట్లాడారు.

Vivek Oberoi: ఆ రెండింటి తర్వాత  సాఫీగా సాగలేదు!

‘కంపెనీ’ (Company), ‘సాధియా’ (Sathiya)చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందారు వివేక్‌ ఒబెరాయ్‌(Vivek Anand Oberoi). ఈ రెండు చిత్రాలు విడుదలై 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ఛానల్‌తో మాట్లాడారు. కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దక్షిణాది సినిమాను ప్రశంసించారు. ‘‘కెరీర్‌ బిగినింగ్‌లనే రెండు భారీ విజయాలు అందుకున్నా. కంపెనీ, సాధియా చిత్రాలు నన్ను నటుడిగా నిలబెట్టాయి. అయితే ఈ రెండు సినిమాల విజయం తర్వాత నా కెరీర్‌ సాఫీగా సాగలేదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నా. 2017 నుంచి 2022 వరకు ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ అనే వెబ్‌ సిరీస్‌, రెండు సినిమాల్లో మాత్రమే నటించాను. ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాను. అది ప్రేక్షకులు ఆదరించకపోతే వారికి క్షమాపణలు చెబుతా. ప్రయత్నం విజయం సాధిస్తే కృతజ్ఞతలు తెలియజేస్తా. అలా నన్ను అభిమానించేవారితో ఎప్పుడూ టచ్‌లో ఉంటా. ఇక దక్షిణాది సినిమాల విషయానికొస్తే... ఇక్కడ కూడా నేను మంచి చిత్రాల్లో నటించా. సౌత్‌ వారు ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ఇక్కడ అమితాబ్‌ బచ్చన్‌ వలే అక్కడ మమ్ముట్టి. నాకు షారుక్‌ ఖాన్‌ ఎంత ముఖ్యమో తమిళంలో అజిత్‌ అంతే ముఖ్యం. నేను వీళ్లందరినీ ఒకేలా అభిమానిస్తాను. దక్షిణాది వాళ్లకు పనిపై నిబద్థత, డెడికేషన్‌, హానెస్టీతో ఉంటారు. నేను మా ఇంట్లో రెండో తరం నటుడిని. మా నాన్నను నా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించమని ఎప్పుడ అడగలేదు. నా టాలెంట్‌తోరు సినిమల్లోకి వచ్చి ఈ స్థాయిలో ఉన్నా. భవిష్యత్తు నా బిడ్డలు సినిమాల్లోకి వస్తానంటే నేను వాళ్లక సాయం చేయను. వాళ్ల ఓన్‌ టాలెంట్‌తో ఉన్నత స్థాయికి చేరుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-12-16T17:19:36+05:30 IST