సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

7 ఏళ్ల ప్రయాణం... 7 జన్మల ప్రయాణంగా మారిందట!

ABN, First Publish Date - 2022-02-19T22:42:58+05:30

బాలీవుడ్‌లో ‘బ్యాండ్, బాజా, బారాత్’ సీజన్ కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య కత్రీనా, రాజ్ కుమార్ రావ్, తరువాత అంకితా లోఖండే... ఇలా చాలా మంది తమకు నచ్చిన వారితో ఏడు అడుగులు వేసేస్తున్నారు. అంతే కాదు, సొషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి కూడా. తాజాగా వైరల్ అవుతోన్న బీ-టౌన్ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ పిక్స్ ఎవరివి అంటారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో ‘బ్యాండ్, బాజా, బారాత్’ సీజన్ కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య కత్రీనా, రాజ్ కుమార్ రావ్, తరువాత అంకితా లోఖండే... ఇలా చాలా మంది తమకు నచ్చిన వారితో ఏడు అడుగులు వేసేస్తున్నారు. అంతే కాదు, సొషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి కూడా. తాజాగా వైరల్ అవుతోన్న బీ-టౌన్ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ పిక్స్ ఎవరివి అంటారా? నటుడు విక్రాంత్ మెస్సీవి... 


విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విక్రాంత్ మెస్సీ శనివారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు పోస్ట్ చేశాడు. ఆయన తన గాళ్‌ఫ్రెండ్, నటి శీతల్ ఠాకూర్‌ని వివాహమాడాడు. వారిద్దరి బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ లుక్స్ ప్రస్తుతం ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. ‘‘ఏడేళ్ల మా ప్రయాణం ఇవాళ్టితో... ఏడు జన్మల ప్రయాణంగా మారింది. మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు...’’ అంటూ విక్రాంత్ ఎమోషనల్‌గా స్పందించాడు. శీతల్‌తో ఆయన పెళ్లి శుక్రవారం నాడు జరిగింది... 

Updated Date - 2022-02-19T22:42:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!