సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vikram Vedha Trailer: హృతిక్ రోషన్ కొత్త సినిమా ట్రైలర్ ఆలస్యం.. లాల్ సింగ్ చడ్డాతో అనుకున్నప్పటికీ..

ABN, First Publish Date - 2022-08-17T19:09:47+05:30

తమిళ విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విక్రమ్ వేద (Vikram Vedha)’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విక్రమ్ వేద (Vikram Vedha)’. గాయత్రి, పుష్కర్ అనే దర్శకద్వయం డైరెక్షన్‌లో 2017లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆ దర్శకులే హిందీలో రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్(Hrithik Roshan), సైఫ్ అలీఖాన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని ఆమీర్ ఖాన్ (Aamir Khan) సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతోపాటు ప్రదర్శించాలని మేకర్స్ అనుకున్నట్లు పుకార్లు వినిపించాయి.


కానీ.. ఆమీర్ సినిమా విడుదలకి ముందు వివాదం చేలరేగింది. ఆయన భారతదేశంలో అసహనం ఎక్కువవుతోందంటూ చేసిన వ్యాఖ్యల ప్రభావం తన కొత్త సినిమాపై పడింది. దాంతో ఆ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. దీంతో విక్రమ్ వేద మేకర్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఆ మూవీ విడుదల సమయానికి కట్ చేసిన ట్రైలర్ మేకర్స్‌కి నచ్చకపోవడం వల్ల.. మరో ట్రైలర్ రెడీ చేయాలని ఫిక్స్ అయినట్లు.. అందుకే ట్రైలర్‌ విడుదల విషయంలో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు మరో ప్రచారం జరుగుతోంది.


అయితే.. ఈ సినిమా హీరో హృతిక్ ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’ గురించి ఓ ట్వీట్ చేశాడు. అందులో.. ‘ఇప్పుడే లాల్ సింగ్ చద్దా చూశాను. నేను ఈ సినిమా నా హృదయానికి హత్తుకునేలా ఉంది. ప్లస్‌లు, మైనస్‌లను పక్కన పెడితే, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ రత్నాన్ని మిస్ అవ్వకండి’ రాసుకొచ్చాడు. దాంతో ఈ స్టార్ రాబోయే సినిమా ‘విక్రమ్ వేద’ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదిక పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు.

Updated Date - 2022-08-17T19:09:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!