సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay Deverakonda: ‘లైగర్’ ప్రమోషన్స్‌లో చెప్పులతో కనిపిస్తున్న విజయ్.. కారణం ఏంటో చెప్పిన స్టైలిస్ట్..

ABN, First Publish Date - 2022-08-05T23:19:22+05:30

విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. పూరీ కనెక్ట్స్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. పూరీ కనెక్ట్స్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘లైగర్’ పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ముంబైలో ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్‌కు విజయ్ హవాయ్ చెప్పులతో హాజరయ్యి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ చెప్పుల ధర రూ. 199అని ధర తెలుస్తోంది. ఇటువంటి చెప్పులను ధరించడానికి గల కారణాన్ని విజయ్ దేవర కొండ స్టైలిస్ట్ హర్మన్ కౌర్ (Harmann Kaur) చెప్పుకొచ్చింది. 


‘లైగర్’ లో విజయ్ దేవరకొండ అండర్ డాగ్‌గా కనిపించనున్నాడు. అందువల్ల సినిమా ప్రమోషన్స్‌లోనే పాత్ర చూపిస్తే బాగుంటుందనుకున్నాడు. దీంతో చెప్పుల ఐడియాను హర్మన్ కౌర్‌కు సూచించాడు. ‘‘ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. విజయ్ లుక్ కోసం అదే పనిగా అనేక బ్రాండ్స్, డిజైన్స్‌ను వెతకడం ప్రారంభించాను. అప్పటికే అద్భుతమైన లుక్‌ను సిద్ధం చేశాను. కానీ, ఒక రోజు విజయ్ పిలిచి పాత్రకు దగ్గరగా ఉండేలా, చాలా అండర్ డాగ్ లాంటి లుక్‌ను సిద్ధం చేయమన్నాడు’’ అని హర్మన్ కౌర్ తెలిపింది. విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రం మాస్ ప్రేక్షకులకు చేరువ కావాలనుకుంటున్నాడు. అందువల్ల లోకల్ ట్రైన్స్‌లో ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఏ ఈవెంట్‌లో చూసినా చెప్పులతోనే కనిపిస్తున్నాడు. అతడి సింప్లిసిటీకి హిందీ ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయ్యారు. ‘లైగర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. విజయ్ చెప్పుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘విజయ్ స్టైల్‌ను చూడండి. అతడి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు నేను వచ్చినట్టు లేదు. నా ట్రైలర్ లాంచ్‌కు అతడు వచ్చినట్టుంది’’ అని రణ్‌వీర్ చెప్పాడు. అంతటితో ఆగకుండా జాన్ అబ్రహాంతో పోల్చాడు. చాలా సార్లు జాన్ ఈ విధంగానే పలు ఈవెంట్లకు హాజరయ్యాడని పేర్కొన్నాడు. 

Updated Date - 2022-08-05T23:19:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!