Vijay Deverakonda: మైక్ టైసన్ దూషించాడు.. ఆ మాటలను తిరిగి మీకు చెప్పలేను..
ABN , First Publish Date - 2022-08-25T21:07:36+05:30 IST
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పెళ్లి చూపులు’,
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). తెలంగాణ యాసతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్గా నటించింది. మైక్ టైసన్, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా విజయ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మైక్ టైసన్‌తో షూటింగ్ అనుభవాలను వివరించాడు.
సినిమా సెట్స్‌లో మైక్ తనను దూషించాడని విజయ్ వెల్లడించాడు. ‘‘మైక్ టైసన్ నన్ను ఇంగ్లీష్‌లో తిట్టాడు. ఆ దూషణాలు ప్రేమతోనే అనేది వేరే విషయం. నేను ఆ మాటలను తిరిగి మీకు చెప్పలేను. కానీ, అతడితో షూటింగ్లో పాల్గొనడం చాలా బాగుంది. మైక్, అనన్యల డైట్ ఒకే విధంగా ఉంటుంది. వీరిద్దరు బాగా తినేవారు. అతడికీ భారతీయ ప్రజలు, మ్యూజిక్, ఆహారం అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే భారతీయ ఆహారం తీసుకురమ్మని అడిగేవాడు. కానీ, ఇండియాలోని భారీ జన సమూహాలు అంటే అతడికీ చాలా భయం. ఒకసారి భారత్‌కు వచ్చినప్పుడు ఆ గుంపులను చూసి హోటల్ నుంచి బయటికీ కూడా రాలేదు’’ అని విజయ్ చెప్పాడు. ‘లైగర్’ ను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. పాన్ ఇండియాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.