సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay Deverakonda: నా ప్రేమ గురించి బహిరంగంగా వెల్లడించను

ABN, First Publish Date - 2022-07-27T22:33:36+05:30

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’(Koffee With Karan). ఈ షో ఆరు సీజన్‌లు ప్రసారమయ్యి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్  కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’(Koffee With Karan). ఈ షో ఆరు సీజన్‌లు ప్రసారమయ్యి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. తాజాగా 7వ సీజన్ ప్రారంభమయింది. ‘డిస్నీ+హాట్ స్టార్‌’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ చాట్ షోకు ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్, సమంత, జాన్వీ కపూర్, అక్షయ్ కుమార్ వంటి సెలబ్రిటీలు హాజరయి సందడి చేశారు. ఈ షోకు సంబంధించిన నాలుగో ఎపిసోడ్ జులై 28న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అనన్య పాండే (Ananya Panday) హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు విజయ్ దేవర‌ కొండ సమాధానమిచ్చాడు. 


‘కాఫీ విత్ కరణ్’ లో భాగంగా విజయ్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన సంగతులను షేర్ చేసుకున్నాడు. ప్రేమ గురించి మాత్రం బహిరంగంగా వెల్లడించనని పేర్కొన్నాడు. ‘‘నేను పెళ్లి చేసుకున్న రోజు ప్రపంచానికి బహిరంగంగా వెల్లడిస్తాను. అంత వరకు నన్ను ఆరాధించేవారి మనస్సును ముక్కలు చేయదలచుకోలేదు. చాలా మంది తమ అభిమాన నటుణ్ని ఇష్ట పడతారు. వాళ్ల గోడ మీద పోస్టర్‌ను ఉంచుకుంటారు. ఎంతగానో అభిమానిస్తుంటారు. అందువల్ల వారిని మనస్సును గాయపర్చదలచుకోలేదు’’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. ఇక కెరీర్ విషయానికీ వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవర కొడ ‘లైగర్’ (Liger) లో నటిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ‘లైగర్’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది.  సమంత‌తో కలసి విజయ్ ‘ఖుషి’ అనే మరో ప్రాజెక్టులో కూడా నటిస్తున్నాడు.

Updated Date - 2022-07-27T22:33:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!