SOUTHలో టేకాఫ్... MUMBAIలో లాండింగ్...
ABN , First Publish Date - 2022-04-05T03:15:26+05:30 IST
ముంబై బ్యూటీస్ హైద్రాబాద్, చెన్నై ఫ్లైట్స్ ఎక్కి సౌత్‌లో దిగిపోతుంటారు. అది రొటీన్. కానీ, ఇప్పుడు రివర్స్ ట్రెండ్ కూడా కొనసాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ యాక్టర్స్ ముంబై బాట పడుతున్నారు. హిందీ తెరపై దక్షిణాది టాలెంట్ గుప్పుమంటోంది. వరుసగా మన సౌత్ స్టార్స్ బీ-టౌన్లో హల్చల్ చేయనున్నారు.
ముంబై బ్యూటీస్ హైద్రాబాద్, చెన్నై ఫ్లైట్స్ ఎక్కి సౌత్‌లో దిగిపోతుంటారు. అది రొటీన్. కానీ, ఇప్పుడు రివర్స్ ట్రెండ్ కూడా కొనసాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ యాక్టర్స్ ముంబై బాట పడుతున్నారు. హిందీ తెరపై దక్షిణాది టాలెంట్ గుప్పుమంటోంది. వరుసగా మన సౌత్ స్టార్స్ బీ-టౌన్లో హల్చల్ చేయనున్నారు.
2022లో ‘లైగర్’ సినిమా బాలీవుడ్లో సెన్సేషన్ సృష్టిస్తుందని అంతా భావిస్తున్నారు. పూరీ జగన్నాథ్ మూవీ మన రౌడీ స్టార్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేయబోతోంది. అయితే, టాలీవుడ్లో విజయ్‌తో కలసి ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన రశ్మిక కూడా బీ-టౌన్ దిశగానే ప్రయాణంలో ఉంది. ఆమె నటించిన ‘మిషన్ మజ్నూ’ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా జూన్‌లో విడుదల కాబోతోంది.
జూన్‌లో రశ్మిక, ఆగస్ట్‌లో విజయ్ దేవరకొండ తమ సినిమాలతో బరిలోకి దిగుతుండగా విజయ్ సేతుపతి కూడా ‘ముంబైకర్’ అనే చిత్రంతో వచ్చేస్తున్నాడు. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాని విజయ్ సేతుపతి ఫస్ట్ హిందీ మూవీ ఓటీటీలో కూడా డైరెక్ట్‌గా స్ట్రీమ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు, మన అక్కినేని వారసుడు నాగ చైతన్య సైతం ముంబై గ్లామర్ ప్రపంచంలో కాలుమోపే పనిలో ఉన్నాడు. హీరోగా కాక ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
విజయ్ దేవరకొండ, రశ్మిక, విజయ్ సేతుపతి, నాగ చైతన్య... వీరి బాలీవుడ్ ఎంట్రీ ఇప్పటికే ఫిక్సైపోగా బెల్లంకొండ శ్రీనివాస్ ఆ దిశగా ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఆయన ప్రభాస్ ‘ఛత్రిపతి’ సినిమా హిందీ రీమేక్‌తో ముంబైలో కాలుమోపుతాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా బాలీవుడ్ సూపర్ స్టార్‌తో రొమాన్స్‌కి రెడీ అవుతోంది. అట్లీ డైరెక్షన్లో కింగ్ ఖాన్ చేయబోయే ఎంటర్టైనర్లో నయన్ కథనాయిక అంటున్నారు. అయితే, బాలీవుడ్ బాద్షా, నయనతార స్టారర్ ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువే.