సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger: ముంబై సీన్ రిపీట్.. పాట్నాలోనూ ప్రమోషన్స్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ

ABN, First Publish Date - 2022-08-08T16:47:37+05:30

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (puri jagannadh), యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో తెరకెక్కిన చిత్రం లైగర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (puri jagannadh), యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లైగర్ (Liger)’. అనన్య పాండే హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌ కింద కరణ్ జోహార్ (Karan Johar), పూరీ టాకిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 25న విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బీజీగా ఉంది. ఈ తరుణంలోనే పాట్నాలోని ఓ కాలేజ్‌లో విజయ్ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించాడు.


కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఓ షాపింగ్‌మాల్‌లో ప్రమోషన్స్‌లో జరిగినట్లే.. పాట్నా(Patna) ఈవెంట్‌లోనూ జరిగింది. దీంతో ఈ ఈవెంట్ నుంచి సైతం మధ్యలోనే వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో విజయ్ చూసిన అభిమానులు ఆయనని దగ్గరగా చూడాలనే ఉద్దేశ్యంతో స్టేజ్ దగ్గరకి పరుగెత్తుకెళ్లారు. అది తొక్కిసలాటకి దారితీసింది. దీంతో సెక్యూరిటీ కోసం విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.


అలాగే.. ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ఓ వీడియోని షేర్ చేశాడు. దానికి.. ‘విజయ్ దేవరకొండకి, ఆయన చిత్రంపై ఉన్న క్రేజ్ ఇది. పాట్నాలోని ఒక కళాశాలలో ఆ యువ నటుడ్ని స్వయంగా కలవాలనే ఆత్రుత తొక్కిసలాటకి దారి తీసింది. దీంతో ఈ నటుడు మళ్లీ ప్రమోషనల్ ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది’ అని రాసుకొచ్చాడు. కాగా.. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాష‌ల్లో విడుదలకానుంది.





Updated Date - 2022-08-08T16:47:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!