సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జూనియర్ ఎన్‌టీఆర్ నుంచే ఆ విషయాలు నేర్చుకున్నానంటున్న Vidyut Jammwal

ABN, First Publish Date - 2022-06-25T23:20:27+05:30

సినీ నేపథ్యం లేకుండా చిత్ర రంగంలోకి అడుగు పెట్టి విలన్‌గా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విద్యుత్ జమ్వాల్ (vidyut jamwal). ‘కమాండో’ సిరీస్‌తో హీరోగా మారిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ నేపథ్యం లేకుండా చిత్ర రంగంలోకి అడుగు పెట్టి విలన్‌గా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విద్యుత్ జమ్వాల్ (vidyut jamwal). ‘కమాండో’ సిరీస్‌తో హీరోగా మారిపోయారు. ‘తుపాకి’, ‘శక్తి’ సినిమాల్లో విలన్ పాత్రలను పోషించి ఇక్కడి వారికీ చేరువయ్యారు. ఆయన గతంలో నటించిన సినిమా ‘ఖుదా హాఫిజ్’ (Khuda Haafiz). ఫరూక్ కబీర్(Faruk Kabir) దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం 2020లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో మేకర్స్ సీక్వెల్‌ను ‘ఖుదా హాఫిజ్: చాప్టర్ 2-అగ్ని పరీక్ష’ (Khuda Haafiz: Chapter II – Agni Pariksha) ను నిర్మిచారు. ఈ సినిమా జులై 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను హైదరాబాద్ నుంచే మొదలుపెట్టింది. అందులో భాగంగా విద్యుత్, ఫరూక్  ‘ABN-Andhrajyothy’ తో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా చెప్పారు. 


తన సినీ ప్రయాణం హైదరాబాద్ నుంచే ప్రారంభమయిందని విద్యుత్ జమ్వాల్ చెప్పారు. ‘‘నా సినిమా కెరీర్ ఇక్కడే ప్రారంభమయిందని బాంబేలో అందరికి గర్వంగా చెబుతుంటాను. ‘శక్తి’ (Sakthi) నా మొదటి సినిమా. జూనియర్ ఎన్‌టీఆర్‌ను ఏ విధంగా పిలవాలో నాకు అర్థమయ్యేది కాదు. ఎన్‌టీఆర్ జూనియర్ అని పిలిచివాడిని. అప్పుడు ఆయన వచ్చి తారక్ అని పిలవమని చెప్పారు. దయ, ప్రేమతో ఉండాలని ఎన్‌టీఆర్ నుంచే నేర్చుకున్నాను. నేను ఎక్కడకు వెళ్లినా ఆ విషయాలను మర్చిపోను. హనుమంతుడు నాకిష్టమన యాక్షన్ హీరో’’ అని విద్యుత్ జమ్వాల్ తెలిపారు. ‘ఖుదా హాఫిజ్: చాప్టర్ 2-అగ్ని పరీక్ష’ ను ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించామని దర్శకుడు చెప్పారు. అందరూ సినిమాను చూసి ఆశీర్వాదించాలన్నారు. జీ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.



Updated Date - 2022-06-25T23:20:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!