భర్త సినిమాల్లో ‘ఆ కారణం’ చేతనే Vidya Balan నటించటం లేదట!

ABN , First Publish Date - 2022-03-17T22:47:09+05:30 IST

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రస్ విద్యాబాలన్ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని పెళ్లాడింది. అయితే, పెళ్లి తరువాత కూడా వరుసగా చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్న మిసెస్ విద్యా, భర్త చిత్రాల్లో మాత్రం, పెద్దగా నటించలేదు. ఈ మధ్య కాలంలో అయితే అస్సలు కనిపించలేదు...

భర్త సినిమాల్లో ‘ఆ కారణం’ చేతనే Vidya Balan నటించటం లేదట!

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రస్ విద్యాబాలన్ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని పెళ్లాడింది. అయితే, పెళ్లి తరువాత కూడా వరుసగా చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్న మిసెస్ విద్యా, భర్త చిత్రాల్లో మాత్రం, పెద్దగా నటించలేదు. ఈ మధ్య కాలంలో అయితే అస్సలు కనిపించలేదు. సిద్ధార్థ్ కపూర్ నిర్మాణంలో విద్యా చేసిన చివరి చిత్రం 2013లో వచ్చిన ‘ఘన్‌చక్కర్’. మళ్లీ ఇన్నేళ్లలో తమ స్వంత బ్యానర్లో ఒక్క సినిమా కూడా చేయలేదామె. 


సాధారణంగా బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ తమ ఓన్ బ్యానర్స్‌లో లేదా తమ కుటుంబీకుల సినిమాల్లో నటించాలంటే ఉత్సాహం చూపిస్తుంటారు. సినిమా సక్సెస్ అయితే లాభాలు కూడా భారీగా వచ్చి పడతాయి. కానీ, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్ ఉన్న విద్యా మాత్రం తాను కావాలనే భర్త నిర్మించే సినిమాల్లో నటించనని చెబుతోంది. ఎందుకంటే,‘‘నీ భర్త వల్లే సాధ్యమైందంటూ... నా విజయాల్ని ఎవ్వరూ తక్కువ చేసి చూపటం నాకు ఇష్టం ఉండదు...’’ అంటోందామె. ‘‘ఈ స్థితికి రావటానికి మేం ఎంతో కృషి చేశాం...’’ అని కూడా వ్యాఖ్యానించిన ఆమె ... తామిద్దరిలో ఒకరి వల్ల మరొకరి విజయాలు చులకన కాకూడదంటోంది. 


నెపోటిజమ్ పేరుతో చాలా రోజులుగా రచ్చ నడుస్తోన్న బాలీవుడ్‌లో విద్యా బాలన్ నిర్ణయం నిజంగా ఆహ్వానించదగ్గదే. భర్త సినిమాల్లో నటిస్తే ఆమెకు అవకాశాలు తేలిగ్గా వచ్చేశాయని ఆరోపించే వారు కూడా ఖచ్చితంగా ఉండే తీరుతారు. అటువంటి వారికి అవకాశం ఇవ్వటం లేదు... సెల్ఫ్ మేడ్ బీ-టౌన్ స్టార్ విద్యా బాలన్! 

Updated Date - 2022-03-17T22:47:09+05:30 IST

Read more